ఐపీఎల్ ప్లేయర్లకు 4 సార్లు కరోనా టెస్టులు

ఎస్వోపీ కోసం ఈసీబీ టిప్స్

న్యూఢిల్లీ: ఐపీఎల్ కోసం వచ్చే ప్లేయర్లకు మొత్తం నాలుగు సార్లు కరోనా టెస్టులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. యూఈఏ చేరుకునేలోపే ఈ పరీక్షలన్నీ పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తోంది. కరోనా ఫ్రీ టోర్నీని నిర్వహించేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ప్ ప్రొసిజర్ (ఎస్వోపీ)ని రూపొందించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తున్నది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమంగ్ అమిన్.. ఈసీబీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. కంప్లీట్‌‌ గా బయో సెక్యూరబుల్ ను క్రియేట్ చేయనున్నారు. ఇందుకోసం కొన్ని గైడ్‌లైన్స్‌ కూడా రూపొందించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

చార్టెడ్ ఫ్లైట్స్ ను ఫ్రాంచైజీలే ఏర్పాటు చేసుకోవాలి.
ప్లేయర్లు, ఫ్రాంచైజీ మెంబర్స్ కు కనీసం రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించాలి.
ఇందులో నెగెటివ్ వస్తేనే ఫ్లైట్లోకి అనుమతి.
యూఏఈ వెళ్లిన తర్వాత మరో రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించి నెగెటివ్ ఉన్నవారిని క్వారంటైన్లోకి పంపిస్తారు.
డ్రెస్సింగ్ రూమ్లో మినిమం మెంబర్స్ కు మాత్రమే పర్మిషన్.
డ్రైవర్లు, చెఫ్ లు, గ్రౌండ్ స్టాఫ్, ఐపీఎల్ మేనేజ్మెంట్, ఫ్రాంచైజీ పర్సన్స్, బ్రాడ్ కాస్ట్ క్రూ, బీసీసీఐ మెంబర్స్.. అందరూ బయోసెక్యూర్ బబుల్లోనే ఉండాలి. ఈ రూల్ ను ఎవరూ బ్రేక్‌ చేయకూడదు.
ప్లేయర్లు, మెంబర్స్ బహిరంగంగా తిరగకూడదు.

For More News..

లెక్కల్లో చూపని బంగారం ఉంటే ఫైన్ కట్టాల్సిందే!

Latest Updates