ఆటోను ఢీకొట్టిన టిప్పర్… నలుగురు మ‌హిళా కూలీలు మృతి

అనంతపురం: జిల్లాలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఘోర‌  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మ‌హిళ‌లు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్ర‌మాదం గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Latest Updates