వీడియో: కరోనా కట్టడికి నాలుగేళ్ల చిన్నారి జాగ్రత్తలు

ప్రపంచ వ్యాప్తంగా వణుకురేపుతున్న కరోనావైరస్ ఎలా అరికట్టాలో ఓ చిన్నారి చక్కగా తెలిపింది. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన ఆరాద్య అనే నాలుగేళ్ల చిన్నారి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. సామాజిక దూరం, ముఖానికి మాస్కులు, శానిటైజర్స్ గురించి అద్భుతంగా చెప్పడం పలువురిని ఆకట్టుకుంది. ఆరాద్య చేసిన ఈ ప్రయత్నానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆరాద్య కల్పించిన అవగాహన అందరినీ ఆకర్షించింది. ఆరాద్య చేసిన ఆ వీడియో సోషల్‌మీడియాలో కొన్ని రోజుల క్రితం వైరల్ అయింది. ఆ వీడియోకు ఇప్పుడు అభినందనలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న సుక్మా జిల్లా ఎస్పీ శలబ్ సిన్హా.. ఆరాద్యను తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. ఆరాద్యను పోలీసుయూనిఫాంతో తన కుర్చీలో కూర్చోపెట్టి శాలువా కప్పి సన్మానించారు. అంతేకాకుండా.. ఆరాద్యను మెచ్చుకుంటూ ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు.

For More News..

విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్

Latest Updates