నాలుగేళ్ల తర్వాత మళ్లీ మీ ముందు ఉంటా: ట్రంప్

మళ్లీ తానే అమెరికా అధ్యక్షుడిని అవుతానంటూ  ధీమా వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన జో బైడెన్ గెలుపును ఒప్పుకోవడం లేదు ట్రంప్. యూఎస్ లోని పలు రాష్ట్రాల్లో ఆయన కేసులు వేశారు. అయితే, కోర్టులో కూడా ట్రంప్ కు నిరాశ ఎదురైంది. దీంతో.. తదుపరి ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తున్నట్టు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.
వైట్ హౌస్ లో ఇచ్చిన క్రిస్మస్ పార్టీలో అతిథులతో  మాట్లాడిన ఆయన.. గత నాలుగేళ్లు ఎవరూ ఊహించని విధంగా గడిచాయని చెప్పారు. మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండేందుకు యత్నిస్తున్నానని… అది కుదరకపోతే.. మరో నాలుగేళ్లలో మీ అందరినీ మళ్లీ కలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు ట్రంప్. ఈ పార్టీకి రిపబ్లికన్ పార్టీలోని ప్రముఖ వ్యక్తులు కూడా హాజరయ్యారు.

Latest Updates