విషాదం.. ఈత‌కు వెళ్లి ఒక‌రి మృతి.. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొర్ర‌కుంట తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువ‌కుల ఈత స‌రదా ఒక‌రి ప్రాణం తీయ‌గా.. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కౌల్ నారాయ‌ణ‌కుంట‌ చెరువులో ఈత‌కు వెళ్లిన ఆ న‌లుగురు.. చెరువు లోతు తెలియ‌క ప్ర‌మాద‌వ‌శాత్తు అందులో పడ్డారు. భ‌యంతో కేక‌లు వేయ‌గా.. అక్క‌డ ఉన్న రైతులు వారిని గ‌మ‌నించి అందులో ఇద్ద‌రిని కాపాడారు. మ‌రో ఇద్ద‌రిలో లింగయ్య అనే యువ‌కుడిని చెరువు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. రాజేందర్ అనే యువ‌కుడి కోసం వెతకగా అత‌ని మృతదేహం లభ్యమైంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తండాలో విషాదం నెల‌కొంది.

Latest Updates