చంద్రయాన్2: జాబిల్లిపై దిగేందుకు ఇంకొక్క అడుగే..

నాలుగోసారి చంద్రుడి కక్ష్య తగ్గింపు సక్సెస్

చంద్రయాన్​ 2 చందమామ దగ్గరికి ఇంకాస్త దగ్గరకు చేరింది. మరో వారం రోజుల్లో జాబిల్లిపై దిగబోతోంది. ఇవాళ ఆగస్ట్ 30… శుక్రవారం రోజున… చంద్రయాన్​ 2 చంద్రుడి కక్ష్యను నాలుగోసారి మార్చింది. దీంతో… చంద్రుడికి మరింత దగ్గరయింది ఇస్రో మానస పుత్రిక, ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 2.

శుక్రవారం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు నాలుగోసారి కక్ష్య దూరాన్ని తగ్గించినట్టు ఇస్రో తెలిపింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కక్ష్య దూరం తగ్గిస్తామని ఇస్రో తెలిపింది. కీలకమైన నాలుగో దశను కూడా విజయవంతంగా పూర్తిచేసింది. చంద్రయాన్2 కక్ష్యను చివరగా ఐదోసారి తగ్గిస్తారు.

సెప్టెంబర్​ 2న చంద్రయాన్​ 2 జాబిల్లి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత ల్యాండింగ్​కు సంబంధించిన కీలక దశ మొదలవుతుంది. చంద్రయాన్ 1 సరిగ్గా ఇదే దశలో ఫెయిల్ కావడంతో… ఈసారి అత్యంత జాగ్రత్తగా ఈ దశను నిర్వహించనున్నారు. సెప్టెంబర్​ 7న విక్రమ్​ ల్యాండర్​ను చంద్రుడిపై దించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై గుంతలు లేని ప్రదేశంలో దిగాక… ఉపగ్రహంలో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి.. చంద్రుడి ఉపరితలపై తిరుగుతుంది. అక్కడి సమాచారాన్ని ఫొటోల రూపంలో పంపుతుంది.

 

Latest Updates