ప్రారంభమైన నాలుగో దశ ఎన్నికలు

9 రాష్ట్రాల్లోని 72 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇవాళ(సోమవారం) ఎన్నికలు  జరుగుతున్న 72 సీట్లలో 2014లో ఒక్క బీజేపీనే 56 స్థానాలు గెలుచుకుంది. కేవలం 2 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కు దక్కాయి. మహారాష్ట్రలో 17 ఎంపీ సీట్లు, రాజస్థాన్ లో 13, యూపీలో 13 సీట్ల చొప్పున పోలింగ్ జరుగుతోంది. బెంగాల్ లో 8 సీట్లు, మధ్యప్రదేశ్ లో ఆరు, ఒడిశాలో ఆరు, బీహార్ లో ఐదు, జార్ఖండ్ లో మూడు, జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. తొలి 3 విడతల్లో 302 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరగగా, చివరి మూడు విడతల్లో 168 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

 

Latest Updates