పుట్టించిన బిడ్డను తాకకుండానే : తల్లి ఒకటి తలిస్తే ఆ దేవుడు మరొకటి తలిచాడు

వాళ్లిద్దరు భార్య -భర్తలు. ఏడేళ్ల వివాహం తరువాత పుట్టిన బిడ్డ మరణించడంతో రెండో సారి పుట్టే బిడ్డను జాగ్రత్తగా, అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశల్ని అడియాసల్ని చేసిన కరోనా.. బిడ్డను ఒక్కసారైనా ముట్టుకోకుండా తల్లిని కబళించింది.

ఇంగ్లాండ్ బర్మింగ్ హోమ్ కు చెందిన ఫోజియా హనీఫ్, వాజీద్ అలీలకు ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. గతేడాది ఫోజియా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్యం కారణంగా ఆ చిన్నారి చనిపోయింది. మళ్లీ మరో సారి ప్రెగన్సీ అవ్వడంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. రెండో సారి పుట్టే బిడ్డను కాపాడుకోవాలని ప్రయత్నాలు చేశారు.

తల్లికి కరోనా

కొద్దిరోజుల క్రితం 36 వారాల గర్భంతో ఉన్న తల్లి ఫోజియా కు ఫీవర్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయినా తగ్గకపోవడంతో కరోనా టెస్ట్ లు చేయాలని డాక్టర్లు సూచించారు. టెస్ట్ లు చేయగా పాజిటీవ్ వచ్చింది. డాక్టర్లు మాత్రం వైరస్ ప్రభావం అంతగా లేదని, ఇంటికి తీసుకొని వెళ్లండని సలహాఇచ్చారు. డాక్టర్ల సలహాతో ఫోజియాను ఇంటికి తీసుకెళ్లారు ఆమెకుటుంబ సభ్యలు.

పుట్టించిన బిడ్డను చూడలేదు

మూడు రోజుల తరువాత బాధితురాలికి ఊపిరి ఆడకపోవడంతో  హార్ట్‌ల్యాండ్ హాస్పిటల్‌లో రికవరీ వార్డులో చేర్పించారు. ఏప్రిల్ 2న సర్జరీ చేసి బాబును బయటకు తీశారు. కానీ పసిబిడ్డకు రిస్క్ అనే ఉద్దేశంతో హనీఫ్‌ను రికవరీ వార్డుకు పంపించి.. బిడ్డను వేరే చోట ఉంచారు.

రికవరీ వార్డ్ లో ఉన్న ఫోజియా తన కుమారుణ్ని చూడలేదు. ఫోటోలలో కుమారుణ్ని చూసి మురిసి పోయింది. ఓ సందర్భంలో ఫోజియా అరోగ్యం విషమించింది. బాధితురాలి రక్తం గడ్డకట్టిందని, కోమాలోకి వెళ్లిందని డాక్టర్లు భర్త వాజీద్ కు చెప్పారు. అత్యవసర చికిత్స కోసం ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఏప్రిల్ 6న ఆమె మరణించింది.

దుఖంలో భర్త వాజీద్

పండంటి కుమారుడికి జన్మనిచ్చిన ఫోజియా కరోనా కారణంగా మృతిచెందిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. భార్య మరణం నుంచి కోలుకోని భర్త ఆమె జ్ణాపకాలతో గడిపేస్తున్నాడు. పుట్టిన బిడ్డకు కరోనా సోకలేదని డాక్టర్లు చెప్పినా.. కుమారుణ్నిఆస్పత్రిలో ఉంచి ట్రీట్ మెంట్ చేయిస్తున్నాడు.

Latest Updates