మసూద్ ‘గ్లోబర్ టెర్రరిస్ట్’ అని UNOలో తీర్మానిస్తాం: ఫ్రాన్స్

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో… ఎలాంటి కుంభకోణం కనిపించలేదన్నారు భారత్ లో ఫ్రాన్స్ అంబాసిడర్ అలెగ్జాండ్రె. అత్యుత్తమ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసిందన్నారు. వచ్చే 6 నెలల్లోనే రాఫెల్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరనున్నాయని చెప్పారు.

పుల్వామా ఉగ్రదాడికి కారకుడైన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించేందుకు త్వరలోనే ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. గత రెండేళ్లుగా మసూద్ అజహర్ పై చర్యల కోసం ఫ్రాన్స్ పట్టుబడుతోందన్నారు అలెగ్జాండ్రె.

Latest Updates