ప్లాస్మాతో కరోనా నయమైంది

కరోనాను ఖతం చేసే మందులు, వ్యాక్సిన్ల పై ఇప్పటికే ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్నా యి. కొన్ని చోట్ల కొత్తట్రీట్ మెంట్లూ జరుగుతున్నా యి. అందులో ఒకటి, ‘ప్లాస్మా ట్రీట్మెంట్’. అంటే, కరోనా నుంచి కో లుకున్న వ్యక్తిరక్తంలోని ప్లాస్మా ను తీసి కరోనా పే షెంట్లకు ఎక్కిం చడం. ఆ వ్యక్తిరక్తంలోని యాంటీ బాడీలు కరోనాను కట్టడి చేస్తాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రీట్మెంట్ అమెరికాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అంతకుముందే  సౌత్ కొరియా  ఆ ట్రీట్మెంట్ ను  మొదలుపెట్టిం ది. ఇద్దరు వృద్ధులకు ప్లాస్మా ట్రీట్మెంట్  ఇచ్చి సక్సెస్ అయింది.

2 డోసులు.. 26 రోజులు

ఫిబ్రవరి 22న 71 ఏళ  ముసలాయన సియోల్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వచ్చాడు. అతడికి టెస్టులు చేయగా కరోనా ఉన్నట్టు తేలిం ది. వెంటనే అతడిని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు. ముందు క్లోరోక్విన్ ఇచ్చి కరో నా లక్షణాలు తగ్గేలా చూశారు . అయినా తగ్గక కపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు పెరి గిపో వడంతో ఎయిడ్స్ మందులు లొపినావిర్ , రిటోనావిర్ ను  రోజూ రెండు సార్లు ఇచ్చారు. పరిస్థితి సీరియస్ గా  మారడంతో వెంటనే వెంటిలేటర్ పెట్టారు. ఆస్పత్రిలో చేరిన పదో రోజున కరోనా నుంచి కోలుకున్న యువకుడి ప్లాస్మా ను తీసి పెద్దాయనకు ఎక్కించారు. 12 గంటల తేడాతో గంట చొప్పున రెండు డోసులి చ్చారు. అయితే, అంతకుముందు రోజే మిథైల్ ప్రెడ్నిసొలోన్ అనే కార్డికో స్టెరాయిడ్ ను  సెలైన్ ద్వారా ఎక్కిం చారు. ఈ రెండు కాంబినేషన్ల ట్రీట్మెంట్ తో  16 రోజులు ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు. 26వ రోజున ఆయనకు కరోనా పూర్తిగా నెగెటివ్ వచ్చిం ది. ఆ తర్వాత రెండుమూ డ్రోజులు ఆయన్ను అబ్జర్వేషన్లో పెట్టి ఇంటికి పంపించారు. 67 ఏళ్ల వృద్ధురాలికి ఇదే రీతిలో 24 రోజుల పాటు ట్రీట్మెంట్ చేశారు. ఆమె కూడా పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లిపోయింది

 ప్రెడ్నిసొలోన్ ఎఫెక్టివేనా?

ఆ ఇద్దరు పేషెంట్లకు ప్లాస్మా ఎక్కిం చడానికి ముం దు ప్రెడ్నిసొల్ను ఇచ్చారు. అయితే కరోనా పేషెంట్లందరికీ ఈ మందును ఇవ్వొద్దన్న  గైడ్ లైన్స్ ఉన్నాయక్కడ. కానీ, పేషెంట్ల ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ప్లాస్మా కన్నాముందుగా ప్రెడ్ని సొలోన్తో ట్రీట్మెంట్ను స్టార్ చేశారు.  మందు ఇచ్చిన వెంటనే పేషెంట్లలో శ్వాస, ఆక్సిజన్ స్థాయులు పెరిగాయని గుర్తించారు. ఊపిరితిత్తులు మామూలు స్థితికి రావడంలో దాని పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. ఈ మందును ముందే ఇవ్వడం వల్ల కరోనా మరణాలను చాలా వరకు  తగ్గించొచ్చని  సూచిస్తున్నా రు.

ఫ్రాన్స్ లో ప్లాస్మా ట్రయల్స్ 

ఫ్రాన్స్‌లోనూ ప్లాస్మా ట్రీట్మెంట్కు శ్రీకారం చుట్టారు. మంగళవారం (ఏప్రిల్ 7) ట్రయల్స్‌ను ఆ దేశ ప్రభుత్వం ప్రారం భించింది. మొత్తం 200 మందిపై ప్రయో గాలు మొదలు పెట్టారు. అందులో 60 మం ది కరోనా పేషెంట్లున్నా రు.

కరోనా పేషెంట్లలో 30 మందికి ప్లాస్మా , మరో 30 మందికి ప్లేసిబోలు (ఇనాక్వ్టి డ్రగ్ : దీనికి జబ్బును తగ్గించే  శక్తి ఉండదు. కానీ, ట్రీట్మెంట్కు పేషెంట్ సహకరిం చేలా చేస్తుంది. శరీరంలో కెమికల్స్ ను  ఉత్తేజ పరిచి జబ్బుపై పోరాడేలా చేస్తుంది) ఇచ్చారు. అసిస్టె న్స్ పబ్లిక్– హాపిటాక్స్ డి ప్యారిస్ (ఏపీ హెచ్‌పీ), ఇన్సెర్మ్ అనే హెల్త్ ఆర్గనైజేషన్, ఐఎటాబ్లిష్మెంట్ ఫ్రాసిస్ డు సాంగ్ (ఈఎఫ్ఎస్) అనే బ్లడ్ అథారిటీలు ట్రయల్స్ ను  పర్యవేక్షిస్తున్నా యి. న్యూయార్క్ లోని  కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్లో ట్రాన్స్ ఫ్యూషన్ స్పెషలిస్ట్ ఎల్డడ్ హాడ్ట్రయల్స్ ను  డైరెక్ట్  చేస్తున్నారు.  రెండు మూడు వారాల్లో ట్రయల్స్ కు  సంబంధించిన ఫస్ట్ రిజల్ట్  వస్తాయని చెబుతున్నారు. కోలుకున్న ఓ వ్యక్తి తన ప్లాస్మాను దానం చేస్తే నలుగురి జీవితాలను కాపాడొచ్చని ఎల్డడ్ చెప్పారు.

ప్రధాని మోడీజీ..మీరు చాలా గ్రేట్

మందు దొరక్క నటి కొడుకు నిద్ర మాత్రలు మింగాడు

Latest Updates