పాక్ పై పోరులో ఇండియాకు ఫ్రాన్స్ అండ

న్యూఢిల్లీ: పాకిస్థాన్, ఆ దేశం అండగా నిలుస్తున్న ఉగ్రవాదులపై పోరులో భారత్ కు ఫ్రాన్స్ వెన్నుదన్నుగా ముందుకొచ్చింది. పుల్వామా దాడి తామే చేశామని పాక్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించినా ఆ దేశం మాత్రం బుకాయిస్తోంది. ఈ సమయంలో ఐక్య రాజ్య సమితిలో ఇండియాకు సపోర్ట్ గా ఫ్రాన్స్ ఓ తీర్మానాన్ని ప్రతిపాదించబోతోంది. జైషే చీఫ్ మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని ప్రతిపాదించేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ పని చేసేందుకు రెడీ అని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు ఆ దేశ ఉన్నత స్థాయి వర్గాల నుంచి ఫోన్ వచ్చింది. ఫ్రాన్స్ దౌత్య సలహాదారు ఫిలిప్ ఎటైన్నీ దీనిపై ఆయనతో చర్చించారు. ఈ విషయంపై పీటీఐకి ఫ్రాన్స్ సమాచారం ఇచ్చింది.

మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని యూఎన్ లో ఫ్రాన్స్ గతంలోనూ ప్రతిపాదించింది. 2017లో చేసిన ప్రయత్నానికి అమెరికా, యూకే మద్దతు తెలిపాయి. అయితే చైనా అడ్డు తగిలింది.

Latest Updates