ఎస్సైని కాల్చి చంపి.. సూసైడ్ చేసుకున్న హెడ్​కానిస్టేబుల్

  • రాజస్థాన్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో ఘటన

న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని బీఎస్ఎఫ్​ క్యాంపులో దారుణం జరిగింది. ఓ జవాను గన్ తో ఇన్ స్పెక్టర్ కాల్చి చంపి.. ఆపై తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలను బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ లోని శ్రీగంగనగర్ జిల్లా బోర్డర్ అవుట్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్న 125 బెటాలియన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శివ చందర్ రావు.. తన సీనియర్, సబ్ ఇన్​స్పెక్టర్ ఆర్పీ సింగ్​ను సర్వీస్ గన్​తో కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే గన్​తో తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఘటనకు కారణాన్ని తెలుసుకోవడానికి సీనియర్ అధికారులు స్పాట్ ను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Latest Updates