ఓఎల్ఎక్స్ లో మోసం.. 12 వేలకు టోకరా

వనపర్తి, వెలుగు: ఓఎల్ఎక్స్ అడ్డాగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఆర్మీ ఉద్యోగుల పేర్లతో వెహికల్స్ సెకండ్​హ్యాండ్ సేల్ కి పెట్టి భారీ మొత్తంలో లూటీ చేస్తున్నారు. స్కూటీ అమ్ముతున్నట్లు చూపించి వనపర్తి టౌన్​కి చెందిన శివగణేశ్​అనే వ్యక్తి నుంచి రూ.12 వేలు దోచుకున్నారు. స్కూటీ రాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి టౌన్​ గ్రీన్ పార్క్ దగ్గర్లో బార్బర్ గా పనిచేస్తున్న గణేశ్.. ఓఎల్ఎక్స్ యాప్ లో ఓ స్కూటీ కొనుగోలుకు బేరం కుదుర్చుకున్నాడు. స్కూటీ ప్యాక్ అవుతున్నట్లుగా అమ్మకందారులు ఫొటోలు పంపించి డబ్బులడగడంతో గణేశ్ .. రూ.12 వేలు గూగుల్ పే ద్వారా పంపించాడు. మరుసటి రోజు ట్రాన్స్ పోర్టులో స్కూటీ రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి వనపర్తి పోలీసులకు బుధవారం కంప్లైంట్ చేశాడు. ఆర్మీ ఫ్యామిలీకి చెందిన స్కూటీ అని చెప్పి, ఆర్సీ, ఓనర్ డీటెయిల్స్, బండి ఫొటోలు పంపించడంతో తాను నమ్మానని బాధితుడు చెప్పాడు. స్కూటీ ఆర్సీ బుక్.. కరీంనగర్ జిల్లా వాసిదిగా గుర్తించిన పోలీసులు.. దోపిడీ చేసిన స్కూటీని చూపించి సదరు వ్యక్తి డబ్బులు దండుకున్నట్లు అనుమానిస్తున్నారు. చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి

క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు

సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్

Latest Updates