బంగారం పేరుతో టోకరా

తక్కువ రేటుకు బంగారం ఇస్తామని నమ్మబలికి పలువురి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం అమ్రాబాద్ సీఐ బీసన్న వెల్లడించారు. అచ్చం పేటకు చెందిన పుట్టపాగ యాదయ్య, అరిగె బాలస్వామి(రాములు), పదర మండలం రాయల గండికి చెందిన ముడావత్ రాం కోటి, అమ్రాబాద్ కు చెందిన బానావత్ భారతి, మహ్మద్
ఖాజా, లక్ష్మాపూర్ తండాకు చెందిన కొర్ర బోడ, ప్రశాంత్ కాలనీకి చెందిన కొయ్యల ఈశ్వరయ్య ఒక ముఠాగా ఏర్పడ్డారు. పొలంలో తమకు బంగారం
కడ్డీలు దొరికాయని, వీటిని సగం రేటుకే అమ్ముతామని పలువురిని నమ్మించారు.

నకిలీ బంగారాన్ని చూపించి లక్షల్లో వసూలు చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పానుగంటి మల్లేశ్ ఈ నెల 8న పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఎంక్వయిరీ చేయగా పానుగంటి మల్లేశ్ , అతని స్నేహితుడు కృష్ణయ్య వద్ద రూ.2 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్ వద్ద రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. దీంతో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పుట్టపాగ యాదయ్య, మూడావత్ రాంకోటి, కొర్రబోడ, అరిగె బాలస్వామి(రాములు)ని రిమాండ్ కు తరలిం చగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు పోచయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.

Latest Updates