మోసం చేసినా..

ఈమధ్య పాశ్చాత్య సంస్కృతికి మన దేశ యువత బాగా అలవాటు పడుతోం ది. ఈక్రమంలో టీనేజీలోనే డేటిం గ్ చేస్తూ వేధింపు-
లకు గురవుతున్న వాళ్లు రోజురోజుకు ఎక్కు వవుతున్నారు. తాజా సర్వే ప్రకారం.. డేటింగ్ చేస్తున్న యువతలో దాదాపు 53 శాతం లైంగిక, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారట. 47 శాతం టీ-
నేజర్లు మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, రెండు శాతం
మంది మాత్రం వేధింపులకు గురి కాగానే బ్రేకప్ చెప్పేస్తున్ నారు. 11 శాతం యువత మాత్రమే తాము డేటిం గ్ చేస్తు న్న వ్యక్తి పై నమ్మకంతో ఉండడం విశేషం. అయితే, 54 శాతం యువత మాత్రం తమ పార్ట్‌‌నర్ మోసం చేశారని తెలిసినా.. వాళ్లనే నమ్ముతున్ నారట. 16 నుంచి 21 ఏళ్ల వయసున్న వాళ్లపై ముం బైకి చెం దిన ‘నిర్మలా నికేతన్ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్’ విద్యార్థులు ఈ సర్వే చేశారు. డేటింగ్ సమయంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైనట్టు 16 నుంచి 18 ఏళ్ల మధ్య, 19 నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న యువతులు చెప్పారు. ఏదైనా వస్తువుతో పార్ట్‌‌నర్ శరీరంపై కాలిన గాయలు చేస్తూ రాక్షసానందం పొందుతున్న
వాళ్లు 42 శాతం ఉన్నారని ఈ సర్వేలో తేలిం ది. ఇక నగ్న ఫొటోలు షేర్ చేస్తానంటూ 40 శాతం పార్ట్‌‌నర్‌‌ వేధిస్తున్ నారట. 37 శాతం యువత తమ డేటిం గ్ భాగస్వామి అనుమతి లేకుండా వాళ్ల వీడియోలు షేర్ చేస్తున్ నారని తెలిసిం ది. 19 నుంచి 21 ఏళ్ల వారితో పోల్చి తే 16 నుంచి 18 ఏళ్ల వయసు వారిలోనే వేధింపులు, అత్యాచారాలు ఎక్కు వగా జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Latest Updates