డాలర్ బాక్సు పార్సిల్ పేరుతో దోపిడీ

సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆకర్షించే అమ్మాయిల వాయిస్ తో మాట్లాడి రూ-.లక్షలు దోచేస్తున్నారు. ఇలాంటిదే అమెరికాలో తనకు డాలర్ బాక్స్ దొరికిందని హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అలీ అనే బాధితుడి నుంచిరూ.1.05 లక్షలు కొట్టేశారు. అతడి ఫిర్యాదుతోకేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులునిందితుడు నైజీరియన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం…. పాతబస్తీకి చెందిన మహ్మద్ అలీకి బిల్లి మాతా పేరుతో అమ్మాయి గొంతుతో ఓ మెసేజ్ వచ్చింది. తను యునైటెడ్ స్టేట్స్ లో అమెరికా సోల్జర్ గా పరిచేస్తున్నానని ఆమె నమ్మించింది. ఇలా ప్రతి రోజూమహ్మద్ అలీకి మెసేజ్ చేస్తూ తనకు ఓ డాలర్ బాక్స్ దొరికిందని చెప్పింది. తను ఆర్మీలో పనిచేస్తున్నాను కాబట్టి తనకు దొరికిన డాలర్ బాక్స్ తన వద్ద ఉండకూడదని సమాచారం ఇచ్చింది. మహ్మద్ అలీని మంచి ఫ్రెండ్ గా భావిస్తున్నాని నమ్మించింది.
డాలర్ బాక్స్ ను ఇండియాకు పంపిస్తానని చెప్పింది. తను ఇండియా వచ్చిన తర్వాత 30శాతం ఇండియన్ కరెన్సీ వాటాగా ఇవ్వాలని మహ్మద్ అలీకి తెలిపింది. అందుకోసం డాలర్ బాక్స్ పంపించడానికి మహ్మద్ అలీ అడ్రెస్ కూడా సేకరించింది.

ఇలా తమ ట్రాప్ లో పడ్డమహ్మద్ అలీకి జనవరి 30న పార్సిల్ ట్రాక్ ను మహ్మద్ అలీకి పంపించింది. ఆ తర్వాత రోజు తను పంపిన పార్సి ల్ ను ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు నిలిపివేశారని చెప్పింది. డాలర్ బాక్స్ హైదరాబాద్ చేరాలంటే కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి రూ.30,500 యాంటీ టెర్రరిజం సర్టిఫికెట్ కోసం రూ.75వేలు చెల్లించాలని ఆమె చెప్పింది. తను చెప్పి న ట్యాక్స్ లు చెల్లించక పోతే ముంబయి ఎయిర్ పోర్టు అధికారులు డాలర్ బాక్స్ ను సీజ్ చేస్తారని నమ్మించింది. డబ్బు చెల్లించకపోతే ముంబయి పోలీసులు అరెస్ట్ చేస్తారని మహ్మద్అలీని బెదిరించింది. దీంతో మహ్మద్ అలీ సైబర్ దొంగ చెప్పి న అకౌంట్ కి డబ్బు ట్రాన్స్ ఫర్చేశాడు. ఆ తర్వాత తనకు పార్సిల్ చేరకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బాధితుడి ఫిర్యాదుతో సైబర్ దొంగ నైజీరియన్ న్వంబ రేమండ్ ఇఫ్నీని శనివారం అరెస్ట్ చేశారు.నిందితుడు సోషల్ మీడియా అడ్డగా సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఫ్రెండ్ షిప్, ఆర్మీ, ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నట్లు తేల్చారు. నకలీ వెబ్ సైట్ లింక్ తో పార్సిల్ ట్రాకింగ్ఐడీని పంపించి బాధితులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. గిఫ్ట్ లు, డాలర్,కరెన్సీ నోట్ల బాక్సులను పంపిస్తున్నామని చెప్పి కస్టమ్స్, జీఎస్టీ-,క్లియరెన్స్ సర్టిఫికెట్ల పేరుతో అందినంత సొమ్ముదోచేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సైబర్ దొంగ న్వంబ రేమండ్ ఇఫ్నీని అరెస్ట్చేసి రిమాండ్ కు తరలించారు.

Latest Updates