నిరుద్యోగులకు ఫ్రీ కంప్యూటర్ శిక్షణ

నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేందుకు ఉచితంగా కంప్యూటర్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ శ్రీరాంనగర్‌కు చెందిన లెటజ్ సర్వ్ ఫౌండేషన్ ప్రతినిధి మహమూద్ అలీ కొన్ని కంప్యూటర్ కోర్సులను ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉపాధిని పొందటానికి కావాల్సిన కంప్యూటర్ ఫండమెంటల్స్, MS ఆఫీస్, ఇంటర్నెట్, DTP, స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ గైడెన్స్ తదితర అంశాల్లో ఉచితంగా శిక్షణ ఉంటుందన్నారు. వీటితో పాటు ప్రతి శనివారం పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్‌ను అందజేయటం జరుగుతుందన్నారు. కోర్సులలో శిక్షణ పొందటానికి 8, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్థులు అర్హులని తెలిపారు. వివరాల కోసం శ్రీరాంనగర్‌లోని ఎస్‌డీ పాయింట్ హోటల్ సమీపంలోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు 9849731084 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.

Latest Updates