పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వలేదు?

మల్కాజిగిరి లోక్ భ నియోజకవర్గం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్డ్డి అవకాశం ఉన్నప్పటికీ పేద విద్యార్థు లకు ఉచిత విద్య అందించలేక పోయాడని, అలాంటి నేత ప్రజాసేవ ఎలా చేస్తాడని కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి మద్దతు కోరేం దుకు వనస్థలిపురంలోని సామ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరిలో ఇంతకుముందు టీడీపీ నుంచి పోటీచేసి గెలిచిన పాల మల్లన్న పార్లమెంట్ మల్లన్న అయ్యాడని అన్నా రు. అనంతరం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరి పార్లమెంట్ మల్లన్న కాస్త మినిస్టర్ మల్లన్న అయ్యాడన్నారు. కానీ ప్రజలకు చేసిం దేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం తన అల్లుడి కి వేలంపాటలో టికెట్ తీసుకొచ్చుకున్నారన్నారు. మల్లారెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహి స్తున్నాడన్నారు. ప్రశ్నించే నాయకుడు ఉన్నప్పుడే ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందని, తాను ఎప్పుడూ ప్రశ్ని స్తూనే ఉంటానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Latest Updates