ఉమెన్స్‌‌ డే స్పెషల్‌‌ ఆఫర్లు

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు స్పెషల్​ నిర్ణయాలు తీసుకున్నాయి. అదే విధంగా వారికోసం కొన్ని ప్రత్యేక ఆఫర్లు ఇచ్చాయి.

కేరళలో మహిళలే ఎస్‌‌హెచ్‌‌వోలు

కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీస్‌‌ స్టేషన్లలో స్టేషన్‌‌ హౌస్‌‌ ఆఫీసర్‌‌‌‌ (ఎస్‌‌హెచ్‌‌వో)గా మహిళా సిబ్బందే ఉంటారని డీజీపీ లోక్‌‌నాథ్‌‌ బెహరా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. “అన్ని పోలీస్‌‌ స్టేషన్లలో మహిళలే ఎస్‌‌హెచ్‌‌వోగా ఉంటారు. వారే కేసులు ఇన్వెస్టిగేట్‌‌ చేస్తారు. సీఎం వెహికల్‌‌ ఎస్కార్ట్‌‌గా కూడా మహిళలే ఉంటారు. సీఎం ఆఫీస్‌‌, అఫీషియల్‌‌ బిల్డింగ్‌‌ తదితర ప్రదేశాల్లో వారికి డ్యూటీలు అలాట్‌‌ చేస్తాం” అని చెప్పారు.

వినాడ్ ఎక్స్​ప్రెస్​ను నడుపుతరు 

ఎర్నాకుళంలో ప్రతి రోజు ఉదయం 10:15 గంటలకు బయలుదేరే వినాడ్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ను ఆదివారం మహిళా సిబ్బందే నడుపుతారని రైల్వే అధికారులు చెప్పారు. లోకోపైలెట్‌‌, అసిస్టెంట్‌‌ లోకోపైలెట్‌‌, పాయింట్స్‌‌మెన్‌‌, గేట్‌‌కీపర్‌‌‌‌, ట్రాక్‌‌ ఉమెన్‌‌ కూడా మహిళలే ఉంటారని ప్రకటించారు. టికెట్‌‌ బుకింగ్‌‌ ఆఫీస్‌‌, ఇన్ఫర్మేషన్‌‌ సెంటర్‌‌‌‌, సిగ్నల్‌‌, క్యారేజ్‌‌, వేగన్‌‌ను కూడా మహిళా సిబ్బందే మెయింటైన్‌‌ చేస్తారన్నారు.

పురాతన కట్టడాల విజిటింగ్ ఫ్రీ 

దేశంలోని పురాతన కట్టడాలను సందర్శనకు మహిళలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు సెంట్రల్ కల్చరల్ మినిస్ట్రీ ప్రకటించింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్ఐ) పరిధిలోని కట్టడాలను విజిట్ చేసేందుకు వచ్చే మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కల్చరల్ మినిస్టర్ ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. ‘‘మన దేశంలో మహిళలను దేవతలుగా భావిస్తారు. వారిని గౌరవించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం” అని అన్నారు. కట్టడాల దగ్గర బేబీ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

Latest Updates