ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్.. సగం ధరకే లాప్‌టాప్

2021 బడ్జెట్‌లో కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం తాయిలాలు

నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు సగం ధరకే లాప్‌టాప్‌లు అందించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నాడు కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి టీఎం థామస్ ఐజాక్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన పదవీకాలంలో చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా అన్ని వర్గాల వారికి భారీ తాయిలాలు ప్రకటించింది. ఈ ఏడాదిలో కేరళ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అనేక జాగ్రత్తలతో ఆకర్షణీయంగా బడ్జెట్ ను తయారు చేశారు. కె.ఫన్ పథకం కింద వచ్చే నెలలో ఉచిత ఇంటర్నెట్ పథకాన్ని ప్రారంభించి జులై నాటికి రాష్ట్రమంతా పూర్తి చేస్తారు. అలాగే లాప్ టాప్ లు కూడా ఏప్రిల్ లోగా అందరికీ అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు  8 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. డిజిటిల్ రంగం మరింత విస్తరించనుండడంతో వచ్చే ఐదేళ్లలో మొత్తం 20 లక్షల ఉద్యోగ అవకాశఆలు కల్పించాలని టార్గెట్ గా పెట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపధ్యంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. వివరిస్తూ.. మరో 4 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం వివరించింది. మేజర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్ లో 15 వేల కోట్లు కేటాయించడంతోపాటు.. స్థానిక సంస్థలకు మరో వెయ్యి కోట్లు కేటాయింపులు చేసింది.

ఇవీ చదవండి

గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి

రేపే వ్యాక్సినేషన్ షురూ.. ఎవరు వేసుకోవచ్చు? ఎవరు వేసుకోకూడదు?

మొక్కను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు.. ఇద్దరి అరెస్ట్

డిప్యూటెషన్ పై మనస్థాపం: MPDO ఆత్మహత్యాయత్నం

Latest Updates