తిరుమలలో రేపటి నుండి ఉచిత లడ్డూ…

తిరుమలలో రేపటి నుంచి ఉచిత లడ్డూ విధానాన్ని ప్రవేశపెడుతుంది టీటీడీ. ఇందుకుగాను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారిని దర్శించుకున్న ప్రతీ భక్తునికి ఒక ఉచిత లడ్డూను ఇవ్వనున్నట్లు చెప్పారు. గతంలో నడకదారిన వచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూను ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం… అదనంగా లడ్డూలు కావాలంటే ఒక్కో లడ్డుకు 50రూపాయలు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఇందుకు 12అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. రోజుకు 4లక్షల లడ్డూల తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Latest Updates