సీఎం గుడ్ న్యూస్ : ఢిల్లీ మహిళలకు ఫ్రీ జర్నీ

ఢిల్లీ :మహిళల కోసం ఢిల్లీ సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుంది. రక్షాబంధన్‌ పర్వదినాన ఢిల్లీ మహిళలకు సీఎం కేజ్రీవాల్‌ గుడ్ న్యూస్ చెప్పారు. ఢిల్లీ మెట్రో, డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించొచ్చని తెలిపారు. అక్టోబరు 29 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. మహిళలందరికీ ఫ్రీ ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించేలా కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆయన.. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.

 

Latest Updates