574 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై

సౌత్ సెంట్రల్ రైల్వే 574 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దైనందిన జీవితంలో పెరుగుతున్న ఇంటర్నెట్ సౌకర్యం, డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 8,500స్టేషన్లలో ఫ్రీవైఫై సౌకర్యాన్ని అందించేందుకు కేంద్రప్రభుత్వం 700కోట్ల నిధుల్ని కేటాయించింది. గతేడాది 600స్టేషన్లలో వైఫైని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది 216స్టేషన్లలో వైఫైను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో 574 రైల్వే స్టేషన్లలో వైఫైను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వేశాఖ తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే  శ్రీకారం చుట్టింది. ఏ1,ఏ,బీ,సీ,డీ,ఇ, ఎఫ్ కేటగిరిలతో పాటు కొత్తగా నిర్మితమైన 12రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫైను అందుబాటులోకి తెచ్చింది

 

 

Latest Updates