ఫ్రీగా వరల్డ్​ టూర్​ : ఆ పైన పైసలిస్తరు!

ఒకసారి ఊహించుకోండి. మీరు ప్రపంచంలోనే టాప్‌‌ టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లకు పోతున్నారు. ఈ ట్రిప్స్‌‌కి మీ ఫ్రెండ్స్‌‌ని కూడా తీసుకెళ్తున్నారు. అది కూడా మీ జేబులో నుంచి ఒక్క పైసా కూడా తీసి ఖర్చుపెట్టకుండా గ్లోబ్‌‌ని చుట్టేస్తున్నారు! నిజంగా కలలాగే ఉంది కదా! ‘ఈ కలను నిజం చేసుకునేందుకు మేం అవకాశం ఇస్తున్నాం.. అప్లై చేసుకోండి.  మీరు లక్కీ విన్నర్‌‌‌‌ అయితే భూగోళాన్ని చుట్టి రావొచ్చు’ అని ఆఫర్ చేస్తోంది ఓ యూకే కంపెనీ.

‘మీ కలల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. మధ్యలో ఏదీ మిమ్మల్ని ఆపలేదు’ అని పెద్దవాళ్లు, జీవితంలో పెద్ద పెద్ద విజయాలు సాధించిన లెజెండ్స్‌‌ చెప్తుంటారు.  కానీ, ఆ మాటని చాలామంది ఒప్పుకోరు. ఫ్యామిలీ, పైసలు, పరిస్థితులు.. ఇలా అన్నింటిని మిక్స్‌‌ చేసి ఒకే ఒక మాట ‘ఇంపాజిబుల్‌‌’ అంటారు. నిజమే! ఆ స్టేట్‌‌మెంట్‌‌ రూల్స్‌‌ పాటించదు. లాజిక్‌‌లనూ పట్టించుకోదు. ఎందుకంటే కొన్ని కలలు నిజం కావాలంటే.. అకుంఠిత దీక్ష, అనంతమైన పట్టుదల ఉంటే సరిపోదు. ఉదాహరణకు…‘ చచ్చేలోపు ఈ భూగోళం మొత్తం ఒక్కసారి చుట్టి రావాలి’ అని చాలామంది కలలు కంటారు. కానీ, గ్లోబ్‌‌లో ఒక్కశాతం తిరిగొస్తే.. అదే గగనం! భూమిని చుట్టి రావాలంటే ఇంట్ల మోపులకు మోపులు నోట్ల కట్టలు ఉండాలి. లేకపోతే అది అయ్యే పని కాదు. ఇప్పటికిప్పుడు అంత సంపాదించాలన్నా కష్టమే! అది మెజారిటీకి సాధ్యం అయ్యే పని కాదు. అందుకే, కలగన్న వాటిని ఇంటర్నెట్‌‌లోనో, టీవీలోనో చూస్తూ  శాటిస్​ఫై అవుతుంటారు. అయితే, గ్లోబ్‌‌ని చుట్టి రావాలనుకునే వాళ్లకు ఒక మంచి అవకాశం కల్పించింది యూకేకి చెందిన ఈ–కామర్స్ మార్కెట్‌‌ ప్లేస్‌‌ ‘Wowcher’.

ఏం చేయాలి?

వావ్‌‌చెర్‌‌‌‌ వెబ్‌‌సైట్లో  అప్లై చేసుకున్న తర్వాత లక్కీ విన్నర్స్‌‌‌‌ని ప్రకటిస్తారు.  ఈ విన్నర్స్‌‌‌‌ కంపెనీ వాళ్లు చెప్పే 40 ‘మిస్టరీ హాలీడే డెస్టినేషన్స్‌‌’ చుట్టి రావాలి. ఇందులో బాలి, న్యూయార్క్‌‌, దుబాయ్! లాంటి  ‘ఒక్కసారి చూసి తీరాలి’ అనిపించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విమానంలో ప్రయాణం, ఎక్కడ ఆగితే అక్కడ మంచి హోటల్స్‌‌లో వసతి. పక్కన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌‌ని కూడా తీసుకుపోయేందుకు అవకాశం.  దేశ విదేశాల్లో ఉన్న  అందమైన  లొకేషన్స్‌‌లో.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ మర్చిపోలేని జ్ఞాపకాలు సృష్టించుకోవచ్చు. ఇలా సంవత్సరం పాటు తిరగాలి. ఈ జర్నీని సక్సెస్‌‌ఫుల్‌‌గా కంప్లీట్ చేసినవాళ్లకు  23 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు.
అంటే ఈ సంవత్సరం మొత్తం పెద్ద జాబ్ చేసినట్టే లెక్క. ‘ఆహా! ఇంకేం కావాలి జీవితానికి. ఎంజాయ్‌‌మెంట్​కి, ఎంజాయ్‌‌.. పైసలకు పైసలు’ అనుకుంటున్నా రు కదా!  అయితే, ఇక్కడ ఒక కండిషన్ ఉంది.

డబ్బులు ఊరికేరావు

‘డబ్బులు  ఊరికే రావు’ అన్నట్టు ఆఫర్లు కూడా ఊరికే రావు.  ఇలాంటి వాటి వెనక ఏదో ఒక కిటుకు ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అందుకే, ఊరికే తిరగడం కాదు. అలా తిరుగుతూ ఏం చేయాలో ‘Wowcher’ వాళ్లు చెప్తారు. ‘ఇది జీవితంలో లభించే ఒకే ఒక అవకాశం. ట్రావెల్‌‌ అంటే ప్రాణం ఇచ్చే వాళ్లకు ఇది పర్‌‌‌‌ఫెక్ట్‌‌గా సరిపోతుంది. గ్రాడ్యుయేట్స్‌‌, సోషల్‌‌ కంటెంట్ క్రియేటర్స్ ఇలా ఎవరైనా.. దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక అయినవాళ్లు తమ గ్లోబల్ టూర్‌‌‌‌ని డాక్యుమెంట్‌‌ చేయాల్సి ఉంటుంది. అది యూనిక్‌‌గా ఉండాలి. వాటిని మేం మా సోషల్‌‌ చానల్స్‌‌లో ప్రసారం చేస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్స్‌‌ అన్నమాట. ఈ ట్రావెల్‌‌కి మీ ఫ్రెండ్స్‌‌ని కూడా తీసుకొని రావొచ్చు.  ‘ఇది నాకు ఫర్ఫెక్ట్ జాబ్’ అనుకునే వాళ్లు..  Wowcher వెబ్‌‌సైట్‌‌లో అప్లై చేసుకోవచ్చు’ అని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పాడు. అంటే ప్రపంచం మొత్తం తిరిగి క్రియేట్ చేసిన కంటెంట్‌‌.. వీళ్లు తమ వ్యూయర్స్‌‌కి అమ్ముకుంటారన్నమాట! దీనికి సంబంధించి ఒక వీడియోని ట్విట్టర్‌‌‌‌లో పోస్ట్‌‌ చేశారు. దానికింద పెట్టిన అన్ని కామెంట్స్‌‌ సారాంశమూ  ‘నాకు తిరగడం చాలా ఇష్టం.. నేను అప్లై చేస్తా’ అనే! వచ్చే సంవత్సరం మార్చిలో డ్రా తీస్తారట. వీడియోగ్రఫీ బాగా వచ్చినవాళ్లు, టూర్స్​కి వెళ్లడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ పోస్ట్‌‌కు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.  ఎవరికి తెలుసు? విన్నర్‌‌‌‌‌‌ మీరే కావొచ్చేమో!!

Latest Updates