దేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకునేందుకు రైతుకు స్వేచ్ఛ 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో దశాబ్దాల పాపాలు పోతాయని, రైతుల పరంగా చూస్తే నిజంగా వరం లాంటిదంటున్నారు బీజేపీ ఎంపీలు. రైతే రాజు అవుతాడని బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, సోయం బాపూరావులు తెలిపారు. అందుకే బిల్లుని చూసి కేసీఆర్‌ ఉల్లిక్కిపడుతున్నారని వారు ఆరోపించారు. ఒక వైపు ఇప్పటికీ  రైతులు మద్దతు ధర కోసం రోడ్లు ఎక్కుతున్నారన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ బిల్లు తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిందన్నారు. గాంధీ కుటుంబ అసంబద్దమైన రాజకీయాల వల్ల ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసునన్నారు. ఈ బిల్లుతో రైతు పంట ఎక్కడ… ఎప్పుడు అమ్ముకోవాలో రైతు నిర్ణయించుకోవచ్చన్నారు అరవింద్.

Latest Updates