మధ్యవర్తుల నుంచి రైతులకు పూర్తి స్వేచ్ఛ

న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన కొత్త వ్యవసాయ బిల్లుల్లో రెండు కీలక బిల్స్ రాజ్య సభలో ఆదివారం ఆమోదం పొందాయి. ఈ నేపథ్యంలో వీటిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రైతులకు ప్రభుత్వం మెరుగైన భవిష్యత్ ఇవ్వడానికి యత్నిస్తోందని నడ్డా చెప్పారు. ‘వ్యవసాయ రంగంలో నవీన మార్పులు, రైతుల బాగు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందినందుకు ప్రధాని మోడీకి శుభాభినందనలు. మద్దతు తెలిపినందుకు ఎంపీలు, రాజకీయ పార్టీలకు మప్పిదాలు. అలాగే దేశంలోని రైతు సోదరులందరికీ అభినందనలు. ఈ బిల్లులు రైతులు పంటలు పండించడానికి, ఉత్పత్తులను అమ్ముకోవడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాయి. మధ్యవర్తులు, దళారీలకు ఇక చోటు లేదు. ఎంఎస్‌‌పీ విధానం అలాగే ఉంటుంది. ఎపీఎంసీ సిస్టమ్ కూడా కొనసాగుతుంది’ అని నడ్డా పేర్కొన్నారు.

Latest Updates