చలి గుప్పిట్లో నార్త్​

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. మంగళవారం టెంపరేచర్లు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాబ్‌‌‌‌‌‌‌‌, హర్యానా, యూపీలో భారీగా పొగమంచు కురిసింది. చలిగాలులు వీచాయి. దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం కూడా చలితీవ్రత ఎక్కువగానే కనిపించింది. మినిమమ్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4.8 డిగ్రీలుగా నమోదైంది. సఫ్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంజ్‌‌‌‌‌‌‌‌లో ఈ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైనట్లు ఇండియన్‌‌‌‌‌‌‌‌ మెటరలాజికల్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చెప్పింది. పాలమ్‌‌‌‌‌‌‌‌లో 4.1, లోథీరోడ్‌‌‌‌‌‌‌‌లో 3.7, అయానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. పొగ మంచు కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడిచాయని అధికారులు చెప్పారు. విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదన్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ కూడా సివియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో ఉందని అధికారులు చెప్పారు. ఢిల్లీలో సోమవారం రికార్డ్‌‌‌‌‌‌‌‌ స్థాయి టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైంది. 119 ఏండ్లలో అతి తక్కువ పగటి టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదు కావడం అదే తొలిసారి.

నార్నౌల్‌‌‌‌‌‌‌‌ @ 2.3

పంజాబ్‌‌‌‌‌‌‌‌, హర్యానాలోనూ చలిగాలులు ఎక్కువగా వీచాయి. హర్యానాలోని నార్నౌల్‌‌‌‌‌‌‌‌లో 2.3 డిగ్రీ సెల్సియస్‌‌‌‌‌‌‌‌ నమోదైంది. ఉమ్మడి రాజధాని చండీగఢ్‌‌‌‌‌‌‌‌లో 4.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, హిస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంబాలా, కర్నాల్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లో కూడా చలి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పొగ మంచు వల్ల రోడ్లు కనిపించక వెహికిల్స్‌‌‌‌‌‌‌‌ నడిపేవారు ఇబ్బందులు పడ్డారు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో కూడా చలి ఎక్కువగానే ఉంది. సికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక డిగ్రీ సెల్సియస్‌‌‌‌‌‌‌‌ ఉష్ణోగ్రత నమోదైంది. గంగానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.1, జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బికనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.7 డిగ్రీలు నమోదైంది. పిలానీ, అజ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చురు, దబోక్‌‌‌‌‌‌‌‌, కోటా తదితర ఏరియాల్లోనూ చలి ఎక్కువగా ఉంది. హిమాచల్​ప్రదేశ్​, బీహార్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​లోనూ చలి తీవ్రత కొనసాగింది.

కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీరో డిగ్రీ సెల్సియస్‌‌‌‌‌‌‌‌

ఉత్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీరో డిగ్రీ సెల్సియస్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్​ నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బహ్రౌచ్‌‌‌‌‌‌‌‌లో 0.2 డిగ్రీలు, ఝాన్సీలో 1.8 డిగ్రీలు నమోదైంది. బారాబంకీ, అమేథీ తదితర ప్రాంతాల్లో కూడా టెంపరేచర్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి.

కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాస్త మెరుగు

కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయలో మంగళవారం పరిస్థితి కొంత మేర మెరుగుపడింది. చలి కాస్త తగ్గిందని అధికారులు చెప్పారు. రాత్రి ఉష్ణో గ్రతలు తగ్గడంతో ప్రజలు రిలీఫ్‌ పొందారని చెప్పారు. బుధవారం నుంచి మంచు కురిసే అవకాశం ఉందని అన్నారు. అయితే ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గుల్మర్గ్ కు మాత్రం పర్యాటకుల తాకిడి తగ్గలేదు. టూరిస్టు లు మంచులో ఎంజాయ్ చేశారు.

Latest Updates