ప్రపంచానికి కొత్త కుబేరుడు.?

ప్రస్తుతం ప్రపంచంలో అపర కుబేరుడు అమెజాన్‌‌‌‌‌‌‌‌ సీఈవో బెజోస్‌‌‌‌‌‌‌‌. ఆ తర్వాత ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌ కో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ బిల్‌‌‌‌‌‌‌‌ గేట్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. వీళ్లిద్దరి తర్వాతి స్థానం ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ లగ్జరీ కంపెనీ ఎల్వీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ సీఈవో, చైర్మన్‌‌‌‌‌‌‌‌ బెర్నార్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌ది. కానీ మూడో స్థానంలో ఉన్న ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌ సొమ్ము రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే గేట్స్‌‌‌‌‌‌‌‌ను దాటేశాడు. త్వరలోనే బెజోస్‌‌‌‌‌‌‌‌ను దాటేలా ఉన్నాడు. ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ రియల్ టైం వెల్త్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఈ విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం బెజోస్‌‌‌‌‌‌‌‌ సంపద రూ. 7 లక్షల 85 వేల కోట్లు, గేట్స్‌‌‌‌‌‌‌‌ సంపద రూ. 7 లక్షల 63 వేల కోట్లు. అయితే టిఫానీ కంపెనీని రూ. లక్షా 14 వేల కోట్లకు ఎల్వీఎంహెచ్ కంపెనీ కొనేందుకు అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకోవడంతో ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌ వర్త్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఒక శాతం, మంగళవారం 3 శాతం పెరిగింది. ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌కు, అతని ఫ్యామిలీకి ఎల్వీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో 47 శాతం షేర్లుండటంతో ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌ సంపాదన ప్రస్తుతం రూ.7 లక్షల 70 వేల కోట్లకు చేరింది. అంటే గేట్స్‌‌‌‌‌‌‌‌ను దాటేశాడన్నమాట.

బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ ప్రకారం మూడో ప్లేసే

బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ ప్రకారం మాత్రం ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌ ఇంకా మూడో స్థానంలోనే ఉన్నాడు. బెజోస్‌‌‌‌‌‌‌‌, గేట్స్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ తన లెక్కలను రోజూ మార్కెట్‌‌‌‌‌‌‌‌ క్లోజ్ అయ్యాక లెక్కగడుతుంటుంది. మొత్తంగా చూస్తే మిగిలిన మెగా బిలియనీర్ల కన్నా వీళ్లు టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ముగ్గురూ చాలా ముందున్నారు. ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌ హాత్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌ వారెన్‌‌‌‌‌‌‌‌ బఫెట్‌‌‌‌‌‌‌‌ సంపాదన రూ. 6 లక్షల 13 వేల కోట్లు. ఫేస్‌బుక్‌‌‌‌‌‌‌‌ సీఈవో మాక్‌‌‌‌‌‌‌‌ జూకర్‌‌‌‌‌‌‌‌ బర్గ్‌‌‌‌‌‌‌‌ సొమ్ము రూ. 5 లక్షల 35 వేల కోట్లు.

Latest Updates