ఫ్రెంచ్‌ ఓపెన్ కు ప్రేక్షకులకు అనుమతి

కరోనా కారణంగా ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా గ్రాండ్‌స్లామ్‌ అలాగే ఈ నెల 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ కు  అనుమతి లేదు.అయితే ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 11 వరకు జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్ కు అభిమానులను అనుమతిస్తున్నారు. ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్‌ జుడిషెల్లీ ఈ విషయాన్ని చెప్పారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం పారిస్‌ వంటి నగరాల్లో 5 వేల మందితో కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెర్నార్డ్‌ తెలిపారు. ఆ మ్యాచ్ జరుగుతున్న స్టేడియం లో 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే వారందరు తప్పకుండ మాస్క్ ధరించాలని, లేకపోతే వారిని లోపలి అనుమతించబోమ‌ని అన్నారు. అయితే ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు మూడు రోజుల్లో రెండు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో నెగెటివ్ వస్తేనే వారిని టోర్నీలోకి అనుమతిస్తామని బెర్నార్డ్‌ జుడిషెల్లీ స్పష్టం చేశారు.

Latest Updates