శ్రీలంకలోమరో బ్లాస్ట్.. డిఫ్యూజ్ చేస్తుండగా పేలిన బాంబు

Fresh blast in Sri Lanka as bomb squad tries to defuse device

సోమవారం రోజున  కొలంబోలోని చర్చీ సమీపంలో మరో బాంబు పేలింది. ఆదివారం అనేకమంది ప్రాణాలు కోల్పోయిన కోటహెన ప్రాంతంలోని చర్చి దగ్గరే ఈ పేలుడు జరిగింది.  బాంబ్ స్క్వాడ్ అధికారులు బాంబును డిఫ్యూజ్ చేసే ప్రయత్నంలో ఈ బాంబు పేలింది. ఒక వ్యానులో ఉన్న బాంబును స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి చెందిన బాంబ్ డిఫ్యూజింగ్ యూనిట్, ఎయిర్ ఫోర్స్ యూనిట్ బాంబును డిఫ్యూజ్ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

మరోవైపు దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే విమానాశ్రయం దగ్గర అమర్చిన బాంబులను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. అటు కొలంబోలోని బస్టాండ్ లో 87 డిటో నేటర్లను గుర్తించారు. హోటళ్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు అధికారులు.

Latest Updates