మ్యాగీ లవర్స్ కోసమే ఈ డాన్స్ మూవ్ మెంట్

న్యూఢిల్లీ: డ్రైగా ఉన్నా లేదా సూప్ గా చేసుకున్నా మ్యాగీ టేస్టే వేరు. దీంట్లో వెజిటేబుల్స్ ను కలిపినా, అవి లేకుండా తయారు చేసినా తినడానికి అందరూ లొట్టలేస్తూ ఆసక్తి చూపుతారంటే నమ్మండి. కొందరు దీన్ని గిన్నెలో వేసుకుని తింటే, మరికొందరు ప్లేట్‌లో హాం ఫట్ అంటూ లాగించేస్తారు. ఈ విశేషాలు చెబుతుంటే మ్యాగీ లవర్స్ కు నోరూరుతోంది కదూ! మీ కోసమే ఈ వీడియో. మీలాగే మ్యాగీని బాగా ఇష్టపడే ఓ అమ్మాయి స్పెషల్ స్టెప్ తో అలరిస్తోంది. పాలక్ వర్మ అనే సదరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మ్యాగీ షేప్ ఎలా మారుతుందనే దాన్ని తన కూల్ స్టెప్స్‌తో చెప్పే యత్నం చేసింది. ట్రేవిస్ స్కాట్ పాడిన రొసాలియా సాంగ్ బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుండగా పాలక్ మ్యాగీ షేప్ డ్యాన్స్‌ మూవ్‌ చేసింది. నేను ప్రిపేర్ చేసినప్పుడు మ్యాగీ ఇలాగే ఉంటుందంటూ ఆ వీడియోపై పాలక్ క్యాప్షన్ జత చేసింది. అలాగే వీడియో ఆఖర్లో తన చేతులను పైకెత్తి టిఫిన్ బాక్సులో మ్యాగీ అంటూ చెప్పేందుకు ట్రై చేసింది. స్కూల్‌, ఆఫీసు అనే తేడా లేకుండా ఎక్కడున్నా త్వరగా ముగించే స్నాక్ అంటే మ్యాగీనే గుర్తొస్తుంది. ఎందుకంటే మ్యాగీని రెండు నిమిషాల్లోనూ తినేయొచ్చు మరి. బాగా పాపులర్ అయిన టూ మినెట్స్ మ్యాగీ నూడుల్‌ను టిఫిన్‌లో ఉంచినప్పుడు అది ఏ షేప్‌లో మారుతుందో పాలక్ దాన్నే తన డ్యాన్స్‌తో చూయించేందుకు యత్నించింది. ఈ వీడియోకు దాదాపు 6.5 వేల వ్యూస్ వచ్చాయి. మ్యాగీ లవర్స్ ఆలస్యమెందుకు మరి.. వీడియోను చూసేయండి.

Latest Updates