MLA తమ్ముడు కోనేరు కృష్ణ కొట్టాడు : FRO అనిత

fro-anitha-statement-on-koneru-konappa-attack

కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాలాలో ఎమ్మెల్యే తమ్ముడు, అనుచరులు జరిపిన దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్- FRO అనిత గాయపడ్డారు. ఆమెను కాగజ్ నగర్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. బాధపడుతూనే..ఆమె పోలీసు ఉన్నతాధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, వాళ్ల మనుషులే తనపై పెద్దపెద్ద వెదురు కర్రలతో దాడి చేశారని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఎమ్మెల్యే తమ్ముడు మొదట కొట్టగానే… చుట్టూ ఉన్న 10 మంది మిగతా వాళ్లు కూడా తనపై దాడి చేశారని అన్నారు.

Latest Updates