అలసట దూరం…

కొంతమందికి ఎప్పుడూ నిరసంగా ఉంటుంది. ఆకలిగా ఉంటుంది. కానీ కొంచెం తిన్నాకూడా అరుగుదల సమస్య వస్తుంది. ఈ ఇబ్బంది నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే నానబెట్టిన బాదం గింజలు, లేదంటే ఒక అరటి పండైనా తినాలి. ఒక్క అయిదు నిమిషాలు సమయం కేటాయించి, రోజూ తప్పనిసరిగా బ్రేక్‌ ఫాస్ట్‌‌ తీసుకోవడం మొదలు పెట్టండి. తప్పకుండా తినడం మాత్రం అవసరం. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణకోశం మెరుగుపడుతుంది. టైమ్‌ కి ఆకలి వెయ్యడం, అరుగుదల పెరగడం మొదలవుతుంది. రోజూ కనీసం రెండు సార్లు మజ్జిగ తీసుకోవాలి. కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. పండ్లు, మంచినీళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం పోతుంది. పొట్ట తేలికగా ఉంటుంది.బ్రేక్‌ ఫాస్ట్‌‌కు ఒక గుడ్డు తినండి.మధ్యాహ్నం లంచ్‌ , రాత్రి డిన్నర్‌ లతో పాటు సూప్‌ తీసుకుంటే బాగుంటుంది.

Latest Updates