పండుగపూట పండ్ల ధరలకు రెక్కలు

వెలుగు : మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడికి అభిషేకం చేసి భక్తులంతా ఒక రోజు ఉపవాసం ఉండడం అనాదిగా వస్తోంది. అయితే ఉపవాసం అనంతరం రకరకాల పండ్లను ఆహారంగా స్వీకరిస్తారు. ఉపవాస దీక్ష విరమిస్తారు. దీంతో శివరాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా పండ్లకు చాలా గిరాకీ ఉంటుంది. హైదరాబాద్​తో పాటు, పలు జిల్లా, మండల కేంద్రాల్లో పండ్లకు డిమాండ్​ ఒక్కసారి పెరగడంతో ధర విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. భక్తులు ఉపవాసం చేస్తారన్న దాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. ఇది మిగతా రోజుల్లో కంటే రెండింతలు ఎక్కువగా ఉందని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.

పండ్ల ధరలు ఇలా..
ద్రాక్ష పండ్లు నిన్నటి వరకు రూ.60 ఇప్పుడు రూ.80 లకు కిలో, కలింగర రూ.20 కిలో, కర్బూజా రూ.40 కి కేజీ, సంత్ర రూ.15 లకు ఒక్కటి , యాపిల్స్ 30 రూపాయల వరకు పెరిగింది.

Latest Updates