FTII అధ్యక్షుడిగా బీపీ సింగ్‌

ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (FTII) అధ్యక్షుడిగా బీపీ సింగ్‌ నియమితులయ్యారు.ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఈ ఉన్నారు. గతేడాది అక్టోబర్ లో అనుపమ్‌ ఖేర్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది పాటు సేవలు అందించిన తర్వాత 2018 అక్టోబరు 31న అనుపమ్‌ ఖేర్‌ ఈ పదవిని వదిలేశారు.

దీంతో FTII పుణే డైరెక్టర్‌ భూపేంద్ర కైన్‌థోలా.. బీపీ సింగ్‌ ను FTII అధ్యక్షుడుగా నియమించారు. ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే అన్ని విషయాలపై సింగ్‌కు అవగాహన ఉంది. మే 2017లో FTII  తరఫున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్‌ ఎడ్యుకేషన్ ‘స్కిల్‌ ఇండియా ఇన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌’ ఆలోచన సింగ్‌దే. దీని ద్వారా దేశంలోని దాదాపు 24 నగరాల్లో 120 షార్ట్‌ కోర్సులను నిర్వహించామన్నారు భూపేంద్ర.

బీపీ సింగ్‌.. పాపులర్‌ టీవీ సిరీస్‌ సీఐడీ కి దర్శకత్వం వహిస్తూ…నిర్మాతగా కూడా ఉన్నారు. ‘సీఐడీ’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ సిరీస్‌ 21 ఏళ్లుగా బ్రేక్‌ లేకుండా సోనీ టీవీలో టెలికాస్ట్‌ అవుతోంది. 2004లో సింగ్‌ పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.

Posted in Uncategorized

Latest Updates