నాకూ ఓ టికెట్‌ .. ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ లో క్యూ

  • ఆశావహులు, ద్వితీయ శ్రేణి నేతల నుం చి లోక్ సభ టికెట్‌కు దరఖాస్తులు

ఆయన ఓ కాంగ్రెస్‌‌ కార్యకర్త. పార్టీకి చాలా ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు. నాయకులంతా ఆయన్ను మర్చిపోయారు. సికింద్రాబాద్‌‌ ఎంపీ టికెట్‌ కావాలని అప్లికేషన్‌‌ ఇచ్చారు. ఇటీవల టీడీపీ నుంచి కాం గ్రెస్‌‌లో చేరిన ఓ నేత జహీరాబాద్‌ లేదా ​నిజామాబాద్‌ టికెట్‌ ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్‌‌లోని ఓ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్‌‌. కాంగ్రెస్‌‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. మహబూబాబాద్‌‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అడిగారు. మరో ప్రొఫెసర్‌.. ఈయన కూడా కాంగ్రెస్‌‌ సభ్యుడు కాదు. ఖమ్మం టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో అతనో రీసెర్చ్‌‌ స్కాలర్‌‌. ఎన్‌‌ఎస్‌‌యూఐ కార్యకర్త. ఎంపీ టికెట్‌ కావాలంటూ అప్లికేషన్‌‌ పెట్టుకున్నారు.

హైదరాబాద్‌, వెలుగు: లోక్ సభ టికెట్ల కోసం ఈ నెల 10 నుం చి దరఖాస్తులు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌ చాన్స్‌ ఇచ్చింది.  ఇందుకు గాం ధీభవన్ లో ఒక కౌంటర్‌ తెరిచిం ది. దరఖాస్తులకు రెండు రోజులు గడువు ఇచ్చిం ది. కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వస్తుంటే ఉబ్బి తబ్బి బ్బయిం ది. ‘అరె మన పార్టీకి మస్తు డిమాం డ్‌ ఉంది’ అని నాయకులు అనుకున్నారు. ఇంకో రెండ్రోజులు టైమ్‌ పెం చి14వ తేదీ వరకు దాఖలు చేసుకోవచ్చని చెప్పారు. మొదటి రెండ్రోజుల్లోనే 150 అప్లికేషన్లు వచ్చాయి. బుధవారం నాటికి అవి 300 వరకు చేరుకున్నాయి. ఆశావహుల నుం చి వస్తున్న దరఖాస్తుల సంఖ్యే కాదు.. వాళ్ల మొహాలను చూసి కూడా నాయకులు ఆశ్చర్యపోతున్నారు. వాళ్లను గుర్తుపట్టక కన్ఫ్యూజ్‌  అవుతున్నారు. కొం దరు వచ్చి తమను తాము పరిచయం చేసుకుంటుం టే.. మరికొం దరు తాము ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన విషయాన్ని గుర్తుచే స్తున్నారు. ఇంకొం దరినైతే మీరెక్కడి నుం చి వచ్చారని వివరాలు అడగడానికి మొహమాట పడిపోయే పరిస్థితి నెలకొం ది. పార్టీలో దశాబ్దాల నుం చి పని చేస్తూ కార్యకర్తలు, నేతలు, వారి చరిత్ర, కుటుంబ నేపథ్యాలపై విస్తృతమైన అవగాహన ఉన్న సీనియర్‌ నేతలు కూడా యాస్పిరెంట్లను చూసి పరేషాన్‌ అయిపోతున్నారు.

డీసీసీలకు భలే గిరాకీ..

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలు విధిగా జిల్లా కాం గ్రెస్ కమిటీ(డీసీసీ) ల నుం చి పీసీసీకి సిఫారసు చేయిం చాల్సిందేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడంతో ఎంపీ సీటుకు పోటీ పడే సీనియర్ల పరిస్థితి ఇబ్బందిగా మారింది. తమ సిఫారసుతో డీసీసీ పదవి పొం దిన అనుచరులతోనే తమ పేరును ఎంపీ అభ్యర్థిగా సిఫారసు చేయించు కోవడం సీనియర్లకు మిం గుడు పడడం లేదు. కొన్ని చోట్ల సీనియర్లనే గౌరవంతో డీసీసీ చీఫ్ లు సానుకూలంగా స్పందిస్తున్నా.. ఇంకొన్ని చోట్ల మాత్రం డీసీసీ చీఫ్ ల నుంచి  సీనియర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్నటి వరకు పార్టీ పదవి కోసం తమ వెంట పడ్డ నాయకులనే ఇప్పుడు తమ పేరును ఎంపీ అభ్యర్థి కోసం సిఫారసు చేయాలని అడగడం తమకు నామోషీయేనని కాం గ్రెస్ సీనియర్లు కొం దరు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. గతంలో ఎంపీలుగా పనిచేసిన వారు, ఎంపీ క్యాండిడేట్లుగా పోటీ చేసి జిల్లాలో తిరుగులేని నేతలుగా ఉన్న కొందరు నేతలు మాత్రం తమకన్న జూనియర్లయిన డీసీసీ చీఫ్ లతో సిఫారసుకు ఆసక్తి చూపడం లేదు. నేరుగా   పీసీసీలతోనే సిఫారసు చేయించుకునేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు డీసీసీ చీఫ్ లు మాత్రం సంతోషంగా ఉన్నారని పార్టీ వర్గా ల్లో ప్రచారం సాగుతోం ది. పదవి వచ్చి రావడంతోనే లోక్ సభకు ఎన్ని కలు రానుం డడం, జిల్లా పరిధిలోని ఎంపీ అభ్యర్థిత్వం కోసం పేరు సిఫారసు చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఓ డీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానిం చారు.

ఏదో ఒకటి రాకపోతదా

లోక్ సభ టికెట్‌ కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్న వారిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలూ ఉన్నారు. వీళ్లకు  డబ్బూదస్కం లేకున్నా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారే. ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడంతో అందివచ్చే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ రాయేసి చూద్దామని అప్లికేషన్లు పెడుతున్నారు. అదృష్టం కలిసొస్తుందేమోనని చూస్తున్నారు. రాహుల్‌ గాంధీ కొన్ని మిరాకిల్స్‌ చేస్తారని అనుకుం టున్నారు. అప్లికేషన్‌ పెడితేనైనా పెద్ద నేతలు గుర్తిస్తారనీ, పార్టీలో వేరే పదవులైనా దక్కుతాయని ఆశపడుతున్నారు. అసెం బ్లీ ఎన్ని కలపుడు టికెట్ల కోసం పోటీ పడ్డ కొం దరు నేతలను, రెబల్ గా బరిలో నిలిచి వారిని పార్టీ పెద్దలు పిలిచి ‘మీకు వేరే పదవులిస్తాం’ తప్పుకోమని హామీలిచ్చా రు. అన్నట్టే చాలా మందికి పార్టీలో పదవులిచ్చారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తేగానీ రాని అవకాశాలు కొందరికి అల్కగా వచ్చిపడ్డాయి. దాం తో తమకూ అలాం టి నసీబ్‌ పట్టక పోతదా అని ట్రయల్‌ వేస్తున్నామని కొం దరు యాస్పిరెంట్లు ‘వెలుగు’తో చెప్పారు.

గెలిచే అభ్యర్థులకే టికెట్లు: కుసుమ కుమార్

వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాం గ్రెస్ అభ్యర్థులను ఈ నెలాఖరున ప్రకటిస్తామని రాష్ట్ర కాం గ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ చెప్పారు. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక ఉంటుం దని, నియోజకవర్గా నికి ఒకరు లేదా ఇద్దరి పేర్లనే ఏఐసీసీకి పంపుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానా లకు కాం గ్రెస్ పోటీ చేస్తుందన్నారు. ఫిబ్రవరి 15 నుంచి  మూడ్రోజులు పార్లమెంట్ సన్నాహక సమావేశాలుంటా యని, 17న పీసీసీ ఎన్ని కల కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఎన్ని కల్లో కాం గ్రెస్ కు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Latest Updates