కరోనా ఇన్యూరెన్సు పాలసీలకు ఫుల్ డిమాండ్

కవచ్పాలసీలు తీసుకుంటున్న వారిలో 18-30 ఏళ్ల వారే ఎక్కువ

రూ. 4-5 లక్షల సమ్ఇన్సూర్డ్పాలసీలకు డిమాండ్

తొమ్మిదిన్నర నెలల కోసం అధికంగా తీసుకుంటున్నారు

న్యూఢిల్లీ: కరోనా భయంతో కోవిడ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు డిమాండ్‌ పెరుగుతోంది. సాధారణ హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు హాస్పిటలైజేషన్‌ బిల్లులను కవర్‌ చేస్తున్నప్పటికీ, కన్జూమర్లు ఎక్కువగా కరోనా స్పెసిఫిక్ పాలసీలను తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. కార్పొరేట్లు కూడా తమ ఉద్యోగుల కోసం గ్రూప్‌ కరోనా పాలసీలను తీసుకుంటున్నాయి. జులై 10 నుంచి 30 మధ్య 60 వేల పాలసీలను అమ్మామని ప్రభుత్వ కంపెనీ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ పేర్కొంది. ఇందులో ఇండివిడ్యువల్‌ , ఫ్యామిలీ పాలసీలున్నాయని చెప్పింది. పశ్చిమ భారతంలో కరోనా పాలసీలకు ఎక్కువ డిమాండ్‌ ఉందని ఈ కంపెనీ పేర్కొంది.

ఇదే కాలంలో 150 పాలసీలను విక్రయించామని మణిపాల్‌ సిగ్నా హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌ చెప్పింది. రూ. 4–5 లక్షల సమ్ ఇన్సూర్డ్‌‌‌‌ పాలసీలకు ఎక్కువ గిరాకీ ఉందని పేర్కొంది. టైర్‌ 2, టై 3 సిటీలలో వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఈ కంపెనీ పేర్కొంది. మ్యాక్స్‌ బూపా హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్ స్‌ 8,000 పాలసీలను అమ్మామని ప్రకటించింది. ఇందులో 80 శాతం వరకు పాలసీలు తొమ్మిదిన్నర నెలల టెన్యూర్‌ కోసం తీసుకున్నవేనని, 90 శాతం మంది రూ. 5 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌‌‌‌ పాలసీల వైపు మొగ్గు చూపారని పేర్కొంది.

పాలసీలో గరిష్టం గా ప్రొవైడ్‌ చేసే మనీని సమ్‌ ఇన్సూర్డ్‌‌‌‌ అంటారు. హైదరాబాద్‌ , బెంగళూరులలో కరోనా పాలసీలకు ఎక్కువ డిమాండ్‌ ఉందని ఈ కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకు మ్యాక్స్‌ బూపా కరోనా కవచ్‌ ప్లాన్‌ ను 18–30 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా కొన్నారని చెప్పిం ది. కరోనా కవచ్‌ తీసుకున్న వారిలో 43 శాతం మంది ఈ ఏజ్‌ గ్రూప్‌ లో ఉన్నవారే నని తెలిపింది. తక్కువ కాల వ్యవధితో నిర్ధిష్టమైన కరోనా పాలసీలకు ఎక్కువ డిమాండ్‌ ఉందని, ముఖ్యంగా మొదటి సారిగా హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్సు‌ తీసుకుంటున్న వారు ఈ పాలసీల వైపు చూస్తున్నారని మ్యాక్స్ బూపా హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ క్రిష్ణన్‌ రామచంద్రన్‌ అన్నారు.

కరోనా కవచ్పాలసీల వైపే..

యంగర్‌ జనరేషన్‌ నుంచి కరోనా కవచ్‌ పాలసీలకు ఎక్కువ డిమాండ్‌ ఉందని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పేర్కొంది. కాగా, కరోనా కవచ్‌ తీసుకున్నవారికి కరోనా ట్రీట్‌మెంట్‌ ఖర్చులను రియంబర్స్‌ చేస్తారు. అదే కరోనా రక్షక్‌‌‌ పాలసీలు తీసుకున్న వారికి ఫిక్స్‌డ్‌ గా బెనిఫిట్స్‌ ఉంటాయి. ‘45 ఏళ్ల లోపు ఉన్న కస్టమర్ల నుంచి కరోనా కవచ్ పాలసీలకు డిమాండ్‌ ఉంది. రూ. 2–5 లక్షల మధ్య సమ్‌ ఇన్సూర్డ్‌‌‌‌ గల పాలసీల గురించి కస్టమర్లు ఎక్కువగా తెలుసుకుంటున్నారు.

కరోనా ట్రీట్‌ మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్‌ పాలసీల వైపు చూస్తున్నారు. ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల టైమ్ పీరియడ్‌ ఉన్న పాలసీలకు మార్కె ట్‌లో మంచి డిమాం డ్‌ ఉంది. పశ్చిమ భారత దేశం నుంచి ముఖ్యం గా మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి కరోనా పాలసీలకు డిమాండ్‌ బాగుంది. ఆ తర్వాత దక్షిణ, తూర్పు భారతదేశం నుంచి ఈ పాలసీలను ఎక్కువగా తీసుకుంటున్నారు’ అని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ గుర్దీప్‌ సింగ్‌ బాత్రా అన్నారు.

రోజుకి 1,000 పాలసీలను అమ్ముతున్నామని, ఇందులో 85% మంది కరోనా కవచ్‌ పాలసీలను తీసుకుంటున్నారని ఆన్‌ లైన్‌ ఇన్సూరెన్స్‌ అగ్రిగేటర్‌ పాలసీ బజార్‌ పేర్కొంది. మిగిలిన 15% మంది కరోనా రక్షక్‌‌‌‌ పాలసీలను తీసుకుంటున్నా రని చెప్పింది. కరోనా నుంచి తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు కూడా స్పెసిఫిక్‌‌‌‌గా కరోనా పాలసీలు తీసుకుంటున్నాయని పేర్కొంది. ‘కరోనా దెబ్బతో కంపెనీలు తమ ఉద్యోగుల కోసం అడిషనల్ కవరేజిలను తీసుకోవడం పెరిగింది. ఇందులో చాలా కంపెనీలు ఇప్పటికే తమ కరోనా కోసం సప్లిమెంటరీ పాలసీలను తీసుకున్నాయి.

కవచ్ పాలసీ కోసం ప్రతీ వారం ఎంక్వైరీ పెరిగింది’ అని సెక్యూర్‌ నౌ ఎండీ అభిషేక్‌‌‌‌ బోండియా అన్నారు. కరోనా ప్రొడక్ట్‌‌‌‌ల సేల్స్‌ మరింత పెరుగుతాయని చెప్పారు. దీని పై ఇంకా పూర్తి అవగాహన ప్రజలలో లేదని, ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్‌ , మార్కెటింగ్‌ పై ఎక్కువ దృష్టిపెట్టాలని అన్నారు. ఇప్పుడు కరోనా పాలసీలు తీసుకుంటున్నవారిలో చాలా మంది దీర్ఘ కాలం కోసం కూడా హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకుంటారని అంచనా వేశారు.

 

Latest Updates