డియోడ్రెంట్, సెంట్లకు ఫుల్ డిమాండ్

వెలుగు, బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌షాపింగ్‌‌‌‌కు వెళ్లే  యువత కళ్లు  ముందుగా వెతికేది కొత్తగా వచ్చిన డియోడ్రంట్లు, పెర్ఫ్యూమ్‌‌‌‌లనే కొత్తగా డియోడ్రంట్లు ఏమి వచ్చాయి.. ఎలా ఉన్నాయి అని చాలా మంది ఆత్రుతగా చూస్తూ ఉంటారు. ఫేస్‌‌‌‌ పౌడర్ స్టేజ్ నుంచి తమ ఆసక్తిని చాలా మంది డియోడ్రంట్ల వాడకంవైపు మళ్లించుకుంటున్నారు. డియోడ్రెంట్, పెర్ఫ్యూమ్‌‌‌‌ను కొట్టుకోనిదే ఇప్పుడు యువతరం బయటికి కూడా వెళ్లడం లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ఇండియన్ మార్కెట్‌‌‌‌లో ఫ్రాగ్రెన్స్‌‌‌‌ల వ్యాపారం చాలా వేగంగా విస్తరిస్తోంది. పట్టణాల్లోనే కాకుండా.. గ్రామాల్లో కూడా డియోడ్రంట్లు, పెర్ఫ్యూమ్‌‌‌‌ల వాడకం పెరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో వీటి బిజినెస్‌‌‌‌ రెట్టింపవుతుందని పలువురు అంచనాలు వేస్తున్నారు. 2019లో  డియోడ్రెంట్ మార్కెట్‌‌‌‌ రూ. 2,500 కోట్లకు పైగా ఉంది. పెర్ప్యూమ్స్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ వాటా మరో రూ. 1500 కోట్లుగా ఉంది. అంటే మొత్తంగా దీని వ్యాపారం రూ.4 వేల కోట్లన్నమాట.

పర్సనల్‌‌‌‌ గ్రూమింగ్‌‌‌‌పై ఆసక్తి పెరుగుతుండడం, అందుబాటు ధరలలోనే డియోడ్రంట్లు, పెర్ఫ్యూమ్‌‌‌‌లు లభిస్తుండడంతో వీటి వాడకం పెరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఇండస్ట్రీ 15 శాతం సీఏజీఆర్‌‌‌‌‌‌‌‌(కాంపౌండ్‌‌‌‌ యాన్యుయల్‌‌‌‌ గ్రోత్‌‌‌‌ రేట్‌‌‌‌) సాధిస్తుందని  విశ్లేషకులంటున్నారు. ‘గతంలో పౌడర్లు రాసుకునే వాళ్లం. ఇప్పుడు డియోడ్రంట్లు, పెర్ఫ్యూమ్‌‌‌‌లను వాడుతున్నాం. మార్కెట్‌‌‌‌లో పర్సనల్‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ వేగంగా వృద్ధి చెందుతోంది’ అని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పారు. దేశంలో అర్బన్‌‌‌‌ ప్రాంతాలలో ప్రతి 100 మందిలో 70 మంది డియోడ్రంట్లను, పెర్ఫ్యూమ్‌‌‌‌లను వాడుతున్నారని తెలిపారు.

డియోడ్రెంట్స్‌‌‌‌ వైపే ఎక్కువ ఆసక్తి..

ప్రస్తుతం ఇండియన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో పెర్ఫ్యూమ్స్‌‌‌‌ కంటే కూడా డియోడ్రంట్స్‌‌‌‌కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇండియా సహజంగా ట్రోపికల్‌‌‌‌ ప్రాంతం కావడంతో ఇక్కడ చెమట, ఉక్కపోత నార్తర్న్‌‌‌‌ హెమీస్పెయిర్‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువగా ఉంటుంది. చెమట, చెమట వాసనను పోగొట్టుకోవడానికి పెర్ఫ్యూమ్‌‌‌‌ల కంటే డియోడ్రంట్లే ఎక్కువగా వాడుతున్నారు. డియోడ్రెంట్ కంపెనీలు కూడా ‘స్వెట్‌‌‌‌ బస్టర్స్‌‌‌‌’ అంటూ స్పెషల్‌‌‌‌గా ప్రచారం చేస్తున్నాయి. దీంతో పాటు పెర్ఫ్యూమ్‌‌‌‌ల కంటే డియోడ్రంట్లలో కెమికల్‌‌‌‌ కంపోజిషన్‌‌‌‌ కూడా తక్కువగా ఉంటుంది. ఆర్గనైజ్డ్‌‌‌‌ ఫ్రాగ్రెన్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో వినీ కాస్మోటిక్స్‌‌‌‌, హిందుస్తాన్‌‌‌‌ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌, ఐటీసీ, నివే ఇండియా, మారికో, మెక్‌‌‌‌న్రో మార్కెట్‌‌‌‌ లీడర్స్‌‌‌‌గా ఉన్నాయి. ఫాగ్‌‌‌‌, ఎంగేజ్, యాక్స్‌‌‌‌, నివే, వైల్డ్‌‌‌‌స్టోన్‌‌‌‌, పార్క్‌‌‌‌ ఎవెన్యూ, సెట్‌‌‌‌వెట్‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌ డియోడ్రంట్ సెగ్మెంట్‌‌‌‌లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి.

Latest Updates