సిటీ శివార్లలో ఇండ్లకు ఫుల్ డిమాండ్

  • కరోనా వైరస్‌ తో మారిన ట్రెండ్
  • అన్ని ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలు
  • వర్క్ ఫ్రమ్ హోమ్‌ కు వీలుగా కొనుగోలు
  • బయ్యర్లకు బిల్డర్స్ ఆఫర్స్

బెంగళూరుకరోనా అవుట్ ‌‌‌‌బ్రేక్‌‌‌‌తో సిటీల వెలుపల రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణే వంటి నగరాల్లోని శివారు ప్రాంతాల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌‌‌‌ఇండ్ల కోసం చూస్తున్నారు. వర్క్ చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు పిల్లలకు స్టడీ రూమ్స్ ఉండేలా ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించడంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌ను ఆఫర్ చేశాయి. ఈ ఫెసిలిటీని 2021 జూన్ వరకు పొడిగించాయి. దీంతో ఇండ్ల కొనుగోలుదారులు  తక్కువ కాలుష్యం ఉండే ప్రాంతాల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. వర్క్‌‌‌‌ప్లేస్‌‌‌‌కు ఎంత దూరం అనేది పరిగణనలోకి తీసుకోకుండా రెసిడెన్షియల్ ప్రాపర్టీలను ప్రజలు కొంటున్నారు.  వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో, వాటి శివారు ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ పెంచిందని నోబ్రోకర్ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కో ఫౌండర్ సౌరభ్ గార్గ్ చెప్పారు. ఇది పలు ప్రాంతాల్లో ధరలు కరెక్షన్‌‌‌‌కు కూడా దారితీసిందన్నారు. కేవలం ఐటీ హబ్స్‌‌‌‌లో మాత్రమే కాక ఇతర ఏరియాల్లో కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీలను అభివృద్ధి చేసేందుకు బిల్డర్లకు ఇదొక గొప్ప అవకాశంగా మారిందన్నారు. మరిన్ని ఏరియాల్లో బిల్డర్లు ప్రాపర్టీలను అభివృద్ధి చేయొచ్చన్నారు. హై డిమాండ్ ఉన్న ఏరియాల్లో ప్రాపర్టీని కొనేందుకు లైఫ్ స్టయిల్‌‌‌‌ను కూడా చాలా మంది మార్చుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా అందుబాటులో ఉన్న కార్పస్‌‌‌‌లోనే ఇంటిని కొంటున్నారు. అసలు ఇళ్లు లేకుండా ఉండటం కంటే ఏదో ఒక హౌస్ ఉండటం మేలని చాలా మందికి ఈ కరోనా వైరస్ నేర్పించింది.

కొత్తపేట, మల్కాజ్‌‌‌‌గిరి, నాగోల్‌‌‌‌ల్లో డిమాండ్‌‌‌‌…

బెంగళూరులో వైట్‌‌‌‌ఫీల్డ్, మరథహల్లి, హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్ లేఅవుట్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల్లో కరోనాకు ముందు మస్తు డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ప్రాంతాలు హోరమావు(32 శాతం), ఎలహంక(56 శాతం), ఆర్‌‌‌‌‌‌‌‌టీ నగర్(42 శాతం) , హెబ్బల్(36 శాతం) ప్రాంతాలకు హోమ్ బయ్యర్ల నుంచి డిమాండ్ వస్తోంది. హైదరాబాద్‌‌‌‌లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. మల్కాజ్‌‌‌‌గిరి(26 శాతం), కొత్తపేట(18 శాతం), నాగోల్(19 శాతం), టోలిచౌకి(9 శాతం), రామచంద్రాపురం(12 శాతం) వంటి ప్రాంతాలలో అంతకుముందుతో పోలిస్తే ఎక్కువ డిమాండ్ నడుస్తోంది. ఇదే ట్రెండ్ చెన్నైలోనూ రన్ అవుతోంది. అంబత్తూర్(46 శాతం), పెరంబూర్(105 శాతం), కోలతూర్(77 శాతం), మైలపూర్(31 శాతం), వలసరవక్కం(26 శాతం) వంటి ప్రాంతాలకు మరిన్ని క్వరీస్ వస్తున్నాయి.  ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్, పుణే వంటి నగరాల్లో కూడా కొత్త ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది.

డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో హౌసింగ్ సేల్స్ 33% జంప్…

హౌసింగ్ సెక్టార్ కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.18 వేల కోట్లు, ఇతర చర్యలు రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌కు సానుకూలంగా నిలవనున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఛైర్మన్ అనుజ్ పురి చెప్పారు. సర్కిల్ రేట్లకు, అగ్రిమెంట్ వాల్యుకు మధ్యనున్న తేడాను కూడా ప్రభుత్వం 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఇది డెవలపర్లకు, హోమ్‌‌బయ్యర్లకు ప్రయోజనకరంగా మారనుందని అనుజ్ పురి అన్నారు. రేట్లు తగ్గనున్నాయని తెలిపారు. సర్కిల్ రేట్ల కంటే తక్కువకు రెసిడెన్షియల్ యూనిట్లు సేల్‌‌కు రానున్నాయని కొలియర్స్ ఇంటర్నేషనల్ ఇండియా ఇన్వెస్ట్‌‌మెంట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ పీయూష్ గుప్తా తెలిపారు. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో హౌసింగ్ సేల్స్ 33 శాతం వరకు పెరగనున్నాయని అనుజ్ పురి అంచనావేస్తున్నారు. ఆన్‌‌లైన్ అగ్రిగేటర్ సైట్స్‌‌లో ఇండ్ల సెర్చ్‌‌లు పెరగడం కూడా హౌసింగ్ సెక్టార్ రికవరీ అవుతుందనే దానికి మరో సంకేతమని అన్నారు. బిల్డర్స్ నుంచి ఆఫర్స్ పెరగడంతో హోమ్ బయ్యర్లు తమ డ్రీమ్ హౌస్ కోసం వెతుకుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. ఇన్వెంటరీని సేల్ చేసుకోవడం కోసం బిల్డర్స్ పలు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అఫర్డబులిటీ పెరగడంతో కూడా ఇండ్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

తగ్గిన వడ్డీరేట్లు

ప్రైస్ కరెక్షన్, ప్రభుత్వ పథకాలు, పలు రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ కోత, తక్కువ వడ్డీరేట్లు  వంటివి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. హౌస్‌‌లోన్ ఇంటరస్ట్ రేట్లు ఇప్పుడు 7 శాతానికి దిగొచ్చాయి. ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు. పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులోకి వస్తే హోమ్ లోన్స్ మరింత చౌకగా లభిస్తాయి. వడ్డీలు తగ్గడంతో ఈఎంఐలు పడిపోతాయి. దీంతో అఫర్డబులిటీ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అంతేకాక చాలా మంది  వర్క్ ఫ్రమ్ హోమ్‌‌కు, పిల్లల ఆన్‌‌లైన్ క్లాసెస్‌‌కు వీలుగా స్టడీ లేదా బాల్కనీ ఉండేలా ఇండ్లను కొంటున్నారు. శివారు ప్రాంతాలతో పాటు చిన్న పట్టణాలకు కూడా కొందరు షిఫ్ట్ అవుతున్నారు. లాంగ్ టర్మ్‌‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసే కంపెనీల ఉద్యోగులు చిన్న పట్టణాల్లో ఇండ్లను కొంటున్నారు.

Latest Updates