‘ఆన్‌లైన్‌’ పాఠాలకు ఫుల్‌ డిమాండ్

స్టూడెంట్స్‌‌కు వర్చువల్‌‌ క్లాసులు
పెరుగుతున్నచదువుల మార్కెట్
అందుబాటులో అన్ని రకాల కోర్సులు

వెలుగు, బిజినెస్‌‌‌‌ డెస్క్కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో టీచింగ్ అంతా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌కు మారిపోయింది. బ్లాక్‌‌‌‌బోర్డులు పోయి, వర్చువల్ బోర్డులు వచ్చేశాయి. ఎడ్‌‌‌‌టెక్ ఇండస్ట్రీకి ఒక్కసారిగా బూమ్ వచ్చింది. ఈ ఇండస్ట్రీలోని స్టార్టప్‌‌‌‌లు, కంపెనీలు కూడా అదే రేంజ్‌‌‌‌లో పైకి ఎగిశాయి. స్టూడెంట్లు, టీచర్లు, విద్యాసంస్థల నుంచి ఆన్‌‌‌‌లైన్ ఎడ్‌‌‌‌టెక్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు మస్తు డిమాండ్ వస్తోంది. అంతకుముందు స్టూడెంట్లు వారానికి రెండు మూడు రోజులు ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌‌‌ వైపు చూస్తే.. ఇప్పుడు రోజూ  ఇంటర్నెట్‌‌‌‌లోనే లెసన్స్‌‌‌‌ వింటున్నారు. పేరెంట్స్ మైండ్‌‌‌‌సెట్ కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ వైపుకే మరలింది. అంతకుముందు ఫోన్ లేదా ల్యాప్‌‌‌‌టాప్ పట్టుకుంటే తిట్టే పేరెంట్స్.. ఇప్పుడు వాటి ద్వారానే లెసన్స్‌‌‌‌ నేర్చుకునేలా స్టూడెంట్లను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఇండస్ట్రీలోని చాలా స్టార్టప్‌‌‌‌లు ఉచితంగా ఆన్‌‌‌‌లైన్ క్లాస్‌‌‌‌లను, వర్చువల్ క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లను, కెరీర్ గైడెన్స్‌‌‌‌ను, ఐఐటీ, జేఈఈ కోచింగ్‌‌‌‌లను, యూపీఎస్‌‌‌‌సీ సెషన్లను అందిస్తున్నాయి. దీనిలో మన హైదరాబాద్‌‌‌‌కు చెందిన ట్యూటోరూట్‌‌‌‌ కూడా ఉంది. ఇది ఐఐటీ, జేఈఈ, నీట్, క్లాస్ 8, 9, 10లకు లెర్నింగ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను అందిస్తోంది.

కరోనా లాక్‌‌‌‌డౌన్ కాలంలో ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్..విద్యార్థుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌‌‌‌లపై ట్యూటోరూట్‌‌‌‌  సీఓఓ రాజీవ్ పాటిల్ ఇంటర్వ్యూ

లాక్‌‌‌‌డౌన్ కాలంలో ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది..? ఏమైనా ఛాలెంజస్ ఫేస్ చేశారా..?

గ్రోత్ చాలా బాగుంది. కొత్త క్యాలెండర్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌గానే మారిపోయారు. ప్రజలకు ఆన్‌‌‌‌లైన్ తప్ప ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది.  స్టూడెంట్లు, టీచర్లు, పేరెంట్స్ కూడా ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌‌‌ను అడాప్ట్ చేసుకున్నారు. ఇంట్లోనే ఉండి స్టూడెంట్లు ఐదు, ఆరు గంటలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో లెసన్స్‌‌‌‌ నేర్చుకుంటున్నారు. ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌‌‌ కోసం ఫస్ట్ మేము జూమ్ వాడాం. కానీ ఇప్పుడు మా సొంత టూల్‌‌‌‌ను బిల్ట్ చేశాం. ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌‌‌లో చాలా ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. టైమింగ్ మనమే సెలక్ట్ చేసుకోవచ్చు. టీచర్లకు, స్టూడెంట్లకు ఇది మంచి అవకాశం. లాక్‌‌‌‌డౌన్ తర్వాత వందల మంది స్టూడెంట్లు మా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో రిజిస్టర్‌‌‌‌ అయ్యారు. మా ప్లాట్‌‌‌‌ఫామ్ ద్వారా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌‌‌‌డ్, నీట్, ఫౌండేషన్, సీబీఎస్‌‌‌‌ఈకి సంబంధించి అన్ని కోర్సులను నేర్చుకోవచ్చు. ఒక బ్యాచ్‌‌‌‌లో 20 మంది స్టూడెంట్లతో డిజిటల్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఐఐటీల నుంచి టీచర్లు విద్యార్థులకు బోధిస్తున్నారు. గ్రాఫికల్ కంటెంట్ ద్వారా టీచింగ్ చేస్తుంటారు.  ప్రతి విద్యార్థికి ఒక కౌన్సెలింగ్ మెంటర్‌‌‌‌‌‌‌‌ను అసైన్ చేసి, వారికి స్టడీ ప్లాన్, టైమ్ మేనేజ్‌‌‌‌మెంట్ విషయంలో సాయం చేస్తుంటాం. .

స్టూడెంట్ల నుంచి టీచర్లకు ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి..?

ఇలాంటివి ఉంటుంటాయి. క్లాస్ రూమ్‌‌‌‌లో పిల్లలు అల్లరి చేస్తుంటారు. అలాగే తొలుత డిజిటల్‌‌‌‌ క్లాస్‌‌‌‌లో  కూడా విద్యార్థులు ఎక్కువగా అల్లరి చేసేవారు. కానీ టీచర్లు వారిని అదుపులోకి తెచ్చారు. మెల్లమెల్లగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.   స్టూడెంట్ల నుంచి ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌‌‌‌పై కూడా ఎప్పడికప్పుడు టీచర్లను అడిగి తెలుసుకుంటున్నాం.

ప్రైమరీ క్లాసుల పిల్లలకు వర్చువల్ క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లు  కష్టం కదా..?

చిన్న పిల్లలకు కంప్యూటర్లపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. తక్కువ టైమ్‌‌‌‌లోనే వారితో ఇంటరాక్ట్ అయ్యేలా ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు చూస్తున్నాయి. కానీ వీరికి నేర్పడం చాలా కష్టమే. ప్రైమరీ క్లాస్ పిల్లలకు యానిమల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటి పేర్లను వివిధ రకాల ఎడ్యుకేషనల్ బోర్డులను వాడుతూ నేర్పవచ్చు.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Latest Updates