
20 శాతం పెరిగిన సేల్స్
ఉత్పత్తి పెంచిన కంపెనీలు
కొత్తగా టీవీ యాడ్స్
లాక్ డౌన్‌తో పెరిగిన పెట్ అడాప్షన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో చాలా మంది ఇంట్లోకి కుక్కపిల్లలను, పెంపుడు జంతువులను తెచ్చి పెంచుకున్నారు. దీంతో 2020లో పెట్ ఫుడ్ సేల్స్ 20 శాతం వరకు పెరిగాయి. పెట్ ఫుడ్ సేల్స్ పెరుగుతుండటంతో.. వీటి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు కూడా ఉత్పత్తిని పెంచుతున్నాయి. పాపులర్ బ్రాండ్స్ పెడిగ్రీ, విస్కాస్, ఐఏఎంఎస్, టెంప్టేషన్ తయారు చేసే మార్స్ పెట్‌కేర్, పురినాను తయారు చేసే ఎఫ్ఎంజీసీ కంపెనీ నెస్లే కిందటేడాది అత్యధికంగా డబుల్ డిజిట్ గ్రోత్‌ను రికార్డు చేశాయి. ఈ సేల్స్ గ్రోత్ కేవలం పెట్ ఫుడ్ స్టోర్ల నుంచే కాకుండా.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచీ వచ్చింది. పెట్ అడాప్షన్ పెరగడంతో ఇండియాలో తమ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నట్టు పెట్ ఫుడ్ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాక కొత్తగా టీవీ కమర్షియల్స్‌ను, డిజిటల్ క్యాంపెయిన్స్‌ను, ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్లనూ కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.
‘మొత్తం కేటగిరీల్లో పెట్ ప్రొడక్ట్స్ పెరిగాయి. పెట్ ఫుడ్‌కూ డిమాండ్ పెరిగింది. లాక్‌డౌన్‌తో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో టైమ్‌పాస్‌కి, ఎంటర్టైన్మెంట్కి చాలామంది పెట్స్‌ను అడాప్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా పెట్లను పెంచుకోవడం ప్రారంభించారు. పెట్ అడాప్షన్ పెరగడంతో ఫుడ్ సేల్స్ కూడా పెరిగాయి’ అని మార్స్ పెట్‌కేర్ ఇండియా జనరల్ మేనేజర్ గణేష్ రమణి అన్నారు. 2020లో పప్పీ(కుక్కపిల్లల) అడాప్షన్ రేట్ 50–100 శాతం పెరిగింది. పిల్లుల పెంపకం కూడా 40 శాతం వరకు పెరిగింది.
పెట్ ఫుడ్ సెగ్మెంట్లో గ్రోత్‌ను తీసుకుంటే… ఇండియాలో పెట్ ఫుడ్ సెగ్మెంట్ 2019 నుంచే పెరుగుతోంది. 2019లో 16 శాతం నుంచి 17 శాతం వరకు మార్కెట్ గ్రోత్ రేటును నమోదు చేసింది. 2020లో ఏకంగా 20 శాతం వరకు వృద్ధిని రికార్డు చేసింది. గ్రోత్ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ప్రజలు కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే స్ట్రక్ అవడమని కంపెనీలు చెబుతున్నాయి. ఈ లాక్డౌన్లో చాలా మంది ఎక్కువ సేపు పెట్స్‌తోనే గడిపారు. వాటికి కావాల్సిన ఫుడ్‌ను నిరంతరం అందించడం, ఆకలితో ఉన్న పిల్లులకు అన్నం పెట్టడం, పెట్స్‌ను పర్యవేక్షించే ఎన్జీవోలకు ఫుడ్‌ను డొనేట్ చేయడం చేశారు. కరోనా లాక్డౌన్ కాలంలో అంచనావేసిన దానికంటే ఎక్కువగా ఈ మార్కెట్ పెరిగిందని మార్స్ పెట్‌కేర్ కంపెనీ చెప్పింది.
ఈ–కామర్స్ షేరు పెరిగింది…
నెస్లే పురినా కూడా పెట్ ఫుడ్ సెగ్మెంట్లో మంచి గ్రోత్‌ను రికార్డు చేసింది. తమ ప్రీమియం పెట్ ఫుడ్ బ్రాండ్ సూపర్కోట్తో కెనిన్ ఫుడ్ కేటగిరీకి కన్జూమర్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు నెస్లే పురినా చెప్పింది. ఇతర ట్రేడ్ ఛానల్స్ మాదిరి, తమ మొత్తం రెవెన్యూలో ఈ–కామర్స్ నుంచి కూడా సహకారం పెరిగినట్టు తెలిపింది. ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి మాత్రమే టీవీ ఛానల్స్‌లో కనిపించే పెట్ ఫుడ్స్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇప్పుడు పెరిగాయి. పురినా సూపర్కోట్ గతేడాది తన తొలి టీవీ కమర్షియల్ యాడ్‌ను లాంచ్ చేసింది.
పెట్ ఫుడ్‌లో 85 శాతం డాగ్ ఫుడ్దే…
2020లో మొత్తం పెట్ ఫుడ్ మార్కెట్లో 85 శాతం వరకు డాగ్ ఫుడ్దే ఉంది. మిగిలినది పిల్లుల ఆహారంగా ఉంది. మార్స్ పెట్‌కేర్ రమణి చెప్పిన ప్రకారం, మొత్తం రూ.2,500 కోట్ల మార్కెట్లో కేవలం 6 శాతం మాత్రమే దేశీయంగా తయారు చేసే పెట్ ఫుడ్ మార్కెట్. మిగిలిందంతా ఇంటర్నేషనల్ మార్కెటే. ఈ మార్కెట్ దేశంలో ఉన్న రెండున్నర కోట్ల పెట్ డాగ్స్‌కు, 45 లక్షల పిల్లులకు ఆహారం అందిస్తోంది. ఇది 20 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో పెట్ సెగ్మెంట్లో మరిన్ని ప్రొడక్ట్‌లను ప్రవేశపెట్టాలని ప్లాన్‌లో ఉన్నట్టు మార్స్ పెట్‌కేర్ రమణి చెప్పారు. చాలా మంది పెట్ ఓనర్లు మాన్యుఫాక్చర్డ్ పెట్ ఫుడ్ సెగ్మెంట్లోకి వస్తున్నట్టు తెలిపారు. కేవలం ఇంట్లో తయారు చేసే ఫుడ్ మాత్రమే పెట్ న్యూట్రిషినల్ అవసరాలను తీర్చవని ప్రజలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూరోమానిటర్ ప్రకారం ఇండియాలో 2025 నాటికి పెట్ ప్రొడక్ట్స్ సేల్స్ 68 శాతం పెరుగుతాయని అంచనాలున్నాయి. మార్కెట్ బాగా పెరుగుతుండటంతో.. ఈ వ్యాపారాల్లోకి కొత్త కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి