సీ ప్లేన్ సర్వీసులకు ఫుల్ డిమాండ్

మరో 14 ఏరో డ్రోమ్ లు రానున్నాయ్

న్యూఢిల్లీ: దేశంలో మరో 14 వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్‌‌‌‌లను డెవలప్‌‌‌‌ చేయాలని ప్రభుత్వం ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. ప్రధాని మోడీ శనివారం ప్రారంభించిన సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లకు మంచి డిమాండ్‌‌‌‌ ఉండడంతో ఈ ట్రాన్స్‌‌‌‌ఫోర్ట్‌‌‌‌ విధానాన్ని మరింత డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. సీప్లేన్‌‌‌‌లు ల్యాండ్‌‌‌‌ అయ్యే లొకేషన్లను వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్‌‌‌‌లని అంటారు. లక్షదీప్‌‌‌‌, అండమాన్ నికోబార్‌‌‌‌‌‌‌‌, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖాండ్‌‌‌‌ వంటి రూట్‌‌‌‌లలో సీప్లేన్‌‌‌‌లను నడిపేందుకు ఈ వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్స్‌‌‌‌ ఉపయోగపడతాయని  ప్రభుత్వం అంచనావేస్తోంది.  రీజినల్‌‌‌‌ కనెక్టివిటీ స్కీమ్‌‌‌‌ ఉడాన్‌‌‌‌ కింద 1 4 వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్స్‌‌‌‌ను ప్రభుత్వం డెవలప్‌‌‌‌ చేయాలనుకుంటోందని షిప్పింగ్‌‌‌‌ మినిస్ట్రీ అధికారులు చెప్పారు. దేశంలో హైడ్రోగ్రాఫిక్‌‌‌‌ సర్వేను జరపాలని ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ అథారిటీ(ఏఏఐ), మినిస్ట్రీ ఆఫ్‌‌‌‌ సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌(ఎంసీఏ) లు ఇన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ అథారిటీ(ఐడబ్ల్యూఏఐ)ని కోరాయి. దీంతో పాటు ప్యాసెంజర్లు సీప్లేన్లలో ఎక్కేందుకు వీలుగా జెట్టీస్‌‌‌‌(ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ వంటివి)ను ఏర్పాటు చేయాలని కోరాయి. కాగా,  నదులు, సముద్రాలు వంటి వాటిని స్డడీ చేయడాన్ని హైడ్రోగ్రాఫిక్‌‌‌‌ సర్వే అంటారు. గుజరాత్‌‌‌‌లో సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను లాంచ్‌‌‌‌ చేశాక, గౌహతి, అండమాన్‌‌‌‌ అండ్ నికోబార్‌‌‌‌‌‌‌‌, ఉత్తరాఖాండ్‌‌‌‌ వంటి రూట్లలో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను ప్రారంభిస్తామని గత వారం షిప్పింగ్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ మన్సుఖ్‌‌‌‌ మాండవీయ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ లోకేషన్ల వైపు ప్రభుత్వం చూపు..

ఈ 14 ఏరోడ్రోమ్‌‌‌‌లను నిర్మించడానికి  ఉత్తరాఖాండ్‌‌‌‌లోని టెహ్రి డ్యామ్‌‌‌‌, గౌహతి నది ముఖం, అస్సాంలోని ఉమాంగ్‌‌‌‌సోలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటితో పాటు మహారాష్ట్రలోని ఖిండ్సి డ్యామ్‌‌‌‌, ఎరాయ్ డ్యామ్‌‌‌‌, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని ప్రకాశం బ్యారేజ్‌‌‌‌, లక్షదీప్‌‌‌‌లోని మినికాయ్‌‌‌‌, కవరత్తి, అండమాన్‌‌‌‌ అండ్ నికోబార్‌‌‌‌‌‌‌‌లోని  హ్యవలాక్‌‌‌‌, నైల్‌‌‌‌, లాంగ్‌‌‌‌, హట్‌‌‌‌బే ఐలాండ్స్‌‌‌‌, గుజరాత్‌‌‌‌లోని శత్రుంజయ వంటి లోకేషన్లు ప్రభుత్వ పరిశీలనలలో ఉన్నాయని తెలిసింది. గుజరాత్‌‌‌‌లో ప్రారంభించిన సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కోసం కాంక్రిట్‌‌‌‌ జెట్టీస్‌‌‌‌ను ఐడబ్ల్యూఏఐ ఏర్పాటు చేసింది. ఈ 14 ఏరోడ్రమ్‌‌‌‌ల కోసం కూడా హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయడానికి, తేలే జెట్టీలను, లైట్‌‌‌‌ హౌస్‌‌‌‌లు వంటివి ఏర్పాటు చేయడానికి ఐడబ్ల్యూఏఐకి ప్రాజెక్ట్‌‌‌‌లను ప్రభుత్వం అప్పగించనుందని అధికారులు అన్నారు.  మోడీ లాంచ్‌‌‌‌ చేసిన సీప్లేన్ సర్వీస్‌‌‌‌ కోసం గుజరాత్‌‌‌‌లో డిఫరెన్సియల్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ పొజిషనింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌(డీజీపీఎస్‌‌‌‌) టెక్నాలజీని డైరక్టరేట్‌‌‌‌ జనరల్ ఆఫ్​ లైట్‌‌‌‌హౌసెస్‌‌‌‌ అండ్‌‌‌‌ లైట్‌‌‌‌షిప్స్‌‌‌‌(డీజీఎల్‌‌‌‌ఎల్‌‌‌‌) ఏర్పాటు చేసింది. సీప్లేన్‌‌‌‌లు ఈ ఏరోడ్రోమ్ వద్ద ల్యాండ్‌‌‌‌ అయ్యేటప్పుడు జీపీఎస్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ ఇచ్చేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.  కాగా, ఈ సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కోసం  స్పైస్‌‌‌‌జెట్‌‌‌‌ మాల్డివుల నుంచి సీప్లేన్‌‌‌‌ను నడిపిన విషయం తెలిసిందే. ఇతర లొకేషన్లలో కూడా ఈ సర్వీస్‌‌‌‌లు స్టార్ట్ అయితే మరిన్ని సీప్లేన్‌‌‌‌లను హైర్ చేసుకుంటామని అధికారులు అంటున్నారు.

సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లకు అప్పుడే టికెట్స్‌‌‌‌ అయిపోయాయి..

సీప్లేన్ సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే 3,000 బుకింగ్స్‌‌‌‌ జరిగాయని స్పైస్‌‌‌‌జెట్‌‌‌‌ ప్రకటించింది. అహ్మదాబాద్‌‌‌‌ రీజియన్‌‌‌‌ నుంచే ఎక్కువ బుకింగ్స్ అయ్యాయని తెలిపింది.గుజరాత్‌‌‌‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ–అహ్మదాబాద్‌‌‌‌ మధ్య సీప్లేన్ సర్వీస్‌‌‌‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ఈ సర్వీస్‌‌‌‌ను స్పెస్‌‌‌‌జెట్‌‌‌‌కు చెందిన ఫుల్లీ ఓన్డ్‌‌‌‌ సబ్సిడరీ కంపెనీ స్పైస్‌‌‌‌ షటల్‌‌‌‌ ఆపరేట్‌‌‌‌ చేసింది. ఈ సీప్లేన్‌‌‌‌లో18 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ సర్వీస్‌‌‌‌లను పోర్ట్‌‌‌‌బ్లేయర్‌‌‌‌‌‌‌‌ నుంచి హ్యవలాక్‌‌‌‌, ఢిల్లీ నుంచి హరిద్వార్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ నుంచి రిషికేష్‌‌‌‌, నైనీ సరస్సు, ఉదయ్‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌, దాల్‌‌‌‌ సరస్సు, లే, కేరళలోని బ్యాక్ వాటర్స్‌‌‌‌కు వెళ్లే రూట్లను, డెస్టినేషన్లను పరిశీలిస్తున్నామని స్పైస్‌‌‌‌జెట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ అజయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ అన్నారు.  అహ్మదాబాద్‌‌‌‌– స్టాచ్యూ ఆఫ్‌‌‌‌ యూనిటీ మధ్య సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ ధర రూ. 1,500 నుంచి రూ. 5,000 వరకు ఉంది.

 

 

Latest Updates