విటమిన్ ​సీ ఫ్రూట్స్​కు మస్త్​ గిరాకీ

విటమిన్ ‘సి’ ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కు కరోనా నేపథ్యంలో డిమాండ్​పెరిగింది. సీఎం కేసీఆర్ కూడా అలాంటివి తినాలని చెప్పడం, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండే ఫుడ్​ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఎక్కువమంది ఇంట్రస్ట్​ చూపుతున్నారు. ప్రస్తుతం సిటీలో సంత్రా, బత్తాయి, మామిడి పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచనల ప్రకారం ప్రతిఒక్కరూ నెలకు 3 కిలోల పండ్లు తినాలి. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 70 వేల టన్నులు బత్తాయి, 1.22 లక్షల టన్నుల నిమ్మ, 5 – 6 లక్షల టన్నుల మామిడి సిటీ మార్కెట్​కు వస్తుందని హోల్​సేల్​ వ్యాపారులు చెబుతున్నారు. మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులు ‘సి’ విటమిన్ అధికంగా ఉండే పండ్లను మొబైల్ రైతుబజార్ల ద్వారా రెసిడెండ్ వెల్ఫేర్ అసోయేషన్స్, గేటెడ్ కమ్యూనిటీలకూ పంపుతున్నారు. మార్కెట్లో డజను సంత్రా రూ.180–రూ.240, బత్తాయి రూ.150–రూ.180 వరకు అమ్ముతున్నారు.

పండ్లు పంచిన మంత్రులు

రాజేంద్రనగర్​లో లాక్​డౌన్​ డ్యూటీ చేస్తున్న ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మంత్రి జగదీశ్​రెడ్డితో కలిసి విటమిన్​ సీ ఉండే ఫ్రూట్స్​ మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, రంగారెడ్డి కలెక్టర్​అమయ్​కుమార్ పాల్గొన్నారు.

సరిపడా తీసుకోవాలె

విటమిన్ ‘సి’ ఉండే ఫ్రూట్స్​తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సంత్రా, బత్తాయి, నిమ్మ, ఉసిరి, జామ, దానిమ్మ, ద్రాక్ష, టమాట, క్యాప్సికమ్ ఇలా120 రకాల పండ్లు, కూరగాయల్లో ‘సి’ విటమిన్ ఉంటుంది. ఈ టైమ్​లో ఇలాంటి సరిపడా తీసుకోవాలి. కార్బైడ్​తో మాగపెట్టే పండ్లు తినొద్దు.

‑ డాక్టర్ సయిదా సన సిద్ధిక్,సీనియర్ డైటీషియన్

 

Latest Updates