అడవిలో అడ్వెంచర్.. పూర్తి విశేషాలు

ఇండియాలో ప్రధానమంత్రి అంటే ఎలా ఉండాలి? గంభీరంగా, హోదా తెచ్చిన పెద్దరికంతో బిగుసుకుపోయినట్టుండాలి. అటువంటిది నరేంద్ర మోడీ ఏమిటి? పులులు తిరిగే కీకారణ్యంలో షికార్లు కొట్టడం, టీవీ షోకోసం అధికారపు ఆడంబరాలన్నీ పక్కన పెట్టేయడమేమిటి? ఈ షో ద్వారా దేశానికి అందించిన సందేశమేమిటి? ఇలా ఎన్నో ఎన్నెన్నో సందేహాలు సోషల్​ మీడియాలో చూస్తున్నాం. ఇంటర్నేషనల్​ చానెల్​ డిస్కవరీ ద్వారా ప్రధాని మోడీ 3 విషయాల్ని చెప్పకనే చెప్పారని ఎనలిస్టులు అంటున్నారు.

మొదటిది ఫిట్​నెస్​ :

దేశంలో 65 శాతానికి పైగా జనాభా యావరేజ్​ ఏజ్​ 35 ఏళ్లు.  మారుతున్న లైఫ్​స్టయిల్​లో ఫిట్​నెస్​ తగ్గిపోతోంది. చిన్న వయసులోనే ఒబేసిటీ, హైపర్​ టెన్షన్​ పెరుగుతోంది. దీన్ని కంట్రోల్​ చేయాలంటే ఫిట్​నెస్​ తప్పనిసరి. ‘నేను అడ్వెంచర్​ చేశా. మీరూ చేయండి. 68 ఏళ్లు వచ్చినా ఫిట్​గా ఉన్నా’నని యూత్​కి మెసేజ్​ ఇచ్చినట్లుంది.

రెండోది టూరిజం :

ఇండియాకి 7,517 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. హిమాలయాలు, వెస్ట్రన్​ ఘాట్స్​ వంటి శ్రేణులున్నాయి. వేల ఏళ్ల నాటి చారిత్రక వారసత్వం మన సొంతం. మరెక్కడా లేనంత బయో డైవర్సిటీ గల దేశం మనది. అయినా, టూరిజంలో మనది 40వ స్థానం. అనేక హిల్​ స్టేషన్లు, నదీనదాలుగల దేశంలో సాహస యాత్రలకు కొదవ ఉండదు. 180 దేశాల దృష్టిని ఆకర్షించి ఇండియాపై అవగాహన కల్పించారు.

మూడోది చురుకుదనం:

ఇండియాలాంటి పెద్ద ప్రజాస్వామిక దేశాన్ని నడిపించే వ్యక్తిలో అలసట, నీరసం ఉంటే ప్రపంచం చిన్నచూపు చూస్తుంది. వెస్ట్రన్​ దేశాల్లో గవర్నమెంట్​ హెడ్స్​ చాలా యాక్టివ్​గా ఉంటారు. అతి పెద్ద డెమొక్రసీ కంట్రీకి ప్రధానిగా ఉన్న వ్యక్తికి యాక్టివ్​నెస్​ చాలా ముఖ్యం. దాదాపు 8 కిలోమీటర్ల దూరాన్ని యాంకర్​తోపాటుగా ఉల్లాసంగా, ఉత్సాహంగా నడిచారు. ఇదికూడా యువతరానికి మెసేజే.

ప్రధాని నరేంద్ర మోడీలోని  మరో కోణాన్ని సోమవారం రాత్రి ‘డిస్కవరీ చానల్’  ప్రసారం చేసిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో ప్రపంచానికి పరిచయం చేసింది. 180 దేశాల్లో ప్రసారమైన ఈ షోలో మోడీ నిజంగానే సాహసం చేశారు. సాహసం అంటే తాడు పట్టుకుని గెంతడమో మరొకటో కాదు. అడవిలో జంతువులు, పాముల మధ్య ఆయన తిరిగారు. సాధారణంగా ప్రధాని ఎక్కడ ఉంటే అక్కడ ఆయన చుట్టూ హై రేంజ్  సెక్యూరిటీ ఉంటుంది. పెద్ద సంఖ్యలో గన్​మెన్లు ఉంటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో కోసం మోడీ సెక్యూరిటీ రూల్స్​ను పక్కన పెట్టారు. తాను ఒక్కరే ఈ షో రూపకర్త  బేర్ గ్రిల్స్​తో కలిసి షూట్​లో పాల్గొన్నారు.ఉత్తరాఖండ్​లో  హిమాలయాల పాదాల వద్ద ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్​లో ప్రధాని సాహస యాత్రను షూట్ చేశారు. జిమ్ కార్బెట్ పార్క్ అంటే అడవి జంతువులకు ఫేమస్. గలగలపారే సెలయేళ్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్. దీనిని ఆనుకుని రామ్​గంగా రిజర్వాయర్​ ఉంది. ప్రధాని మోడీ, బేర్ గ్రిల్స్ ఇద్దరూ కలిసి ఓ జీపులో అడవి అంతా టూర్ చేశారు. ఈ టూర్లో ఓ చోట సెలయేరు వచ్చింది. ఇద్దరూ జీపు దిగి చిన్న పడవ వేసుకుని సెలయేరులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ షో సందర్భంగా మోడీ, బేర్ గ్రిల్స్ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. అడవుల్లో తిరిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను  బేర్ గ్రిల్స్, ప్రధాని మోడీకి వివరించారు. మోడీ తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ప్రకృతితో తనకు చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధాన్ని మోడీ వివరించారు. 18ఏళ్ల వయసులో ఇల్లు విడిచి హిమాలయాలకు వెళ్లిన సంగతి చెప్పారు.హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలతో కొంతకాలం కలిసి ఉన్నానన్నారు. వారి నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. పేదరికంలో గడిపిన బాల్యాన్ని , అప్పటి రోజులను, ఆ జ్ఞాపకాలను  బేర్ గ్రిల్స్​తో  పంచుకున్నారు.

ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని  ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని బేర్ గ్రిల్స్​కి  ప్రధాని మోడీ చెప్పారు. మోడీకి చిన్నప్పటి నుంచి ప్రతి రోజూ  చెరువులో స్నానం చేసే అలవాటు ఉండేదట.ఓ రోజు ఇలాగే స్నానం చేస్తుంటే ఓ మొసలి పిల్ల చేతికి తగిలిందట. ఆ మొసలి పిల్లను అలాగే ఇంటికి తీసుకెళ్లి చూపిస్తే , పిల్లను తల్లి నుంచి  ఎందుకు వేరు చేశావంటూ వాళ్లమ్మ కోప్పడటం,  ఆ తర్వాత మొసలి పిల్లను అలాగే తీసుకొచ్చి మళ్లీ  అదే చెరువులో వదిలేసిన సంగతిని  బేర్ గ్రిల్స్​కి మోడీ వివరించారు.

ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు..

మ్యాన్​ వర్సెస్​ వైల్డ్… ఇంతకుముందు ఈ ప్రోగ్రాం కేవలం డిస్కవరీ చానెల్​ ఆడియన్స్​కి మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచంలోని 90 శాతం ప్రజానీకానికి పరిచయమైంది. మ్యాన్​ వర్సెస్​ వైల్డ్​ అనే ప్రోగ్రాంని 14 ఏళ్ల క్రితం (2006 నవంబర్​ 16) మొదటిసారి టెలికాస్ట్​ చేశారు. అప్పటి నుంచీ ఏడు సీజన్లలో మొత్తం 73 ప్రోగ్రాంలను పూర్తి చేశారు. మరో మూడు స్సెషల్​ ఎపిసోడ్లను కార్యక్రమ యాంకర్​ బేర్​ గ్రిల్స్​ చేశారు. ‘వర్కింగ్​ ది వైల్డ్’​ టెలికాస్ట్​ అయ్యాక 2012లో కాంట్రాక్ట్​లో వివాదం రావడంతో ప్రోగ్రాం నిలిచిపోయింది. నెట్​ఫ్లిక్స్​ ముందుకు రావడంతో ఎనిమిదో సీజన్ మళ్లీ మొదలైంది. దీనిలో మొదటి ఎపిసోడ్​ని ప్రధాని మోడీతో చేశారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఒక కార్యక్రమం నిలిచిపోయిందంటే, ఆడియన్స్​ అభిరుచిలో చాలా మార్పులొస్తాయి. జనం మరచిపోతారు కూడా. దానికోసం ప్రపంచమంతటినీ ఎట్రాక్ట్​ చేయగల ఒక ప్రోగ్రాం అవసరం. అందుకే ప్రధాని నరేంద్ర మోడీని ఎంచుకున్నారు. ఆయన ఎంతో హుషారుగా గ్రిల్స్​తో కలిసి… నిలువెత్తు రెల్లు పొదల్లో నడుస్తూ, నదిలో బోటుని నడుపుతూ ఎనిమిది కిలోమీటర్ల దూరం సాగిపోయారు. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టుగా ఈసారి ప్రధాని నరేంద్ర మోడీతో కార్యక్రమం చేయడంతో ఎకాఎకీన 180 దేశాలవారు చూడగలిగారు.

లైఫ్​లో అడ్వంచర్​లూ ఉండాలి

మ్యాన్ అండ్ వైల్డ్ షో ద్వారా యూత్ కు ఓ మెస్సేజ్ ఇచ్చారు ప్రధాని మోడీ. చదువులు, కెరీర్ ఇవే జీవితం కాకూడదన్నారు. కాంక్రీట్ జంగిల్ వంటి సిటీలను వదిలి ఎక్కడకు వెళ్లడానికి యూత్ ఆసక్తి చూపకపోవడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యువతరం యూత్ ఫుల్ గా ఉండాలన్నారు. రొటీన్ లైఫ్ ను పక్కన పెట్టి అప్పుడప్పుడు సరదాగా  అడ్వంచర్స్ చేయాలన్న  మెసేజ్ ఇచ్చారు. ఈ విషయంలో తనను ఇన్ స్పిరేషన్ గా తీసుకోవాలని పరోక్షంగా చెప్పారు.

8 కిలోమీటర్లు నడిచిన మోడీ

సాధారణంగా ప్రధాని అంటే ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే పరిమితమవుతారు. ప్రధాని హోదాలో ఎక్కడకు వెళ్లినా విమానాల్లో వెళతారు. బయటి టూర్ చేసినా కార్లలోనే వెళతారు. నరేంద్ర మోడీ వీటన్నిటినీ బ్రేక్ చేశారు. 68 ఏళ్ల వయసులో పులులకు అడ్డా వంటి అడవిలో ఏమాత్రం భయం లేకుండా తిరిగారు. ఎనిమిది కిలోమీటర్లకు పైగా నడిచారు. ఈ వయసులో కూడా తాను ఫిట్ గానే ఉన్నానని చాటుకున్నారు.

ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు

మ్యాన్​ వర్సెస్​ వైల్డ్… ఇంతకుముందు ఈ ప్రోగ్రాం కేవలం డిస్కవరీ చానెల్​ ఆడియన్స్​కి మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచంలోని 90 శాతం ప్రజానీకానికి పరిచయమైంది. మ్యాన్​ వర్సెస్​ వైల్డ్​ అనే ప్రోగ్రాంని 14 ఏళ్ల క్రితం (2006 నవంబర్​ 16) మొదటిసారి టెలికాస్ట్​ చేశారు. అప్పటి నుంచీ ఏడు సీజన్లలో మొత్తం 73 ప్రోగ్రాంలను పూర్తి చేశారు. మరో మూడు స్సెషల్​ ఎపిసోడ్లను కార్యక్రమ యాంకర్​ బేర్​ గ్రిల్స్​ చేశారు. ‘వర్కింగ్​ ది వైల్డ్’​ టెలికాస్ట్​ అయ్యాక 2012లో కాంట్రాక్ట్​లో వివాదం రావడంతో ప్రోగ్రాం నిలిచిపోయింది. నెట్​ఫ్లిక్స్​ ముందుకు రావడంతో ఎనిమిదో సీజన్ మళ్లీ మొదలైంది. దీనిలో మొదటి ఎపిసోడ్​ని ప్రధాని మోడీతో చేశారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఒక కార్యక్రమం నిలిచిపోయిందంటే, ఆడియన్స్​ అభిరుచిలో చాలా మార్పులొస్తాయి. జనం మరచిపోతారు కూడా. దానికోసం ప్రపంచమంతటినీ ఎట్రాక్ట్​ చేయగల ఒక ప్రోగ్రాం అవసరం. అందుకే ప్రధాని నరేంద్ర మోడీని ఎంచుకున్నారు. ఆయన ఎంతో హుషారుగా గ్రిల్స్​తో కలిసి… నిలువెత్తు రెల్లు పొదల్లో నడుస్తూ, నదిలో బోటుని నడుపుతూ ఎనిమిది కిలోమీటర్ల దూరం సాగిపోయారు. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టుగా ఈసారి ప్రధాని నరేంద్ర మోడీతో కార్యక్రమం చేయడంతో ఎకాఎకీన 180 దేశాలవారు చూడగలిగారు.

అసలీ ప్రోగ్రాం ఏమిటి?

మ్యాన్​ వర్సస్​ వైల్డ్​ కార్యక్రమానికి చాలా మారుపేర్లున్నాయి. సాహసోపేతమైన పనులతో, దట్టమైన అడవులు, మంచు ప్రాంతాలు, కొండ శిఖరాలను ఎంచుకుని సాహసోపేతంగా అక్కడి పరిస్థితుల్ని తెలియజేస్తూ,  ప్రమాదాలెదురైతే ధైర్యంగా ఢీకొనడం వంటి పనులతో ఫుల్​ యాక్షన్​ ఓరియంటెడ్​గా సాగే సర్వైవల్​ ప్రోగ్రాం ఇది. అందుకే దీనిని బోర్న్​ సర్వైవల్​: బేర్​ గ్రిల్స్​, అల్టిమేట్​ సర్వైవల్​, సర్వైవల్​ గేమ్​, రియల్​ సర్వైవల్​ హీరో వగైరా పేర్లతో టెలికాస్ట్​ చేస్తుంటారు.  పేరు ఏదైనా ప్రోగ్రాం హోస్ట్​గా బేర్​ గ్రిల్స్​తోనే డిస్కవరీ చానెల్​ చేయించింది. ప్రతి ఎపిసోడ్​ని వారం పది రోజులపాటు షూట్​ చేస్తారు. గ్రిల్స్​తో పాటు స్టోరీ ప్రొడ్యూసర్​, ఇద్దరు కెమెరా సినిమాటోగ్రాఫర్లు, ఇద్దరు ఫీల్డ్​ రికార్డిస్టులు, సౌండ్​ ఇంజినీర్​, లొకేషన్​ గైడ్​ ఉంటారు. మొత్తం షూట్​ అయ్యాక ఒకటికి పదిసార్లు ప్రతి ఫ్రేమ్​​ని చూసుకుంటూ ఎడిటింగ్​ చేస్తారు.

ఎవరీ బేర్ గ్రిల్స్? 

అడ్వంచర్ షో లకు పెట్టింది పేరు బేర్ గ్రిల్స్ బ్రిటన్ వాసి. 1974లో పుట్టాడు. ఇతని అసలు పేరు ఎడ్వర్డ్​ మైఖేల్​ గ్రిల్స్​. చదువు తర్వాత బ్రిటన్ సైన్యంలో 1994 నుంచి 97 వరకు రకరకాల హోదాల్లో పనిచేశారు. గ్రిల్స్​కి చిన్నప్పటి నుంచి ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలన్న కోరిక ఉండేది. ఆర్మీ నుంచి తిరిగొచ్చాక 1998 మేలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి తన కలను నిజం చేసుకున్నారు. ఆ తర్వాత అనేక సాహసాలు చేశారు. అడ్వంచర్లు చేయడమే కాదు మంచి రచయిత కూడా. హిమాలయాల్లో తాను చేసిన సాహసయాత్ర నేపథ్యంలో ‘ఫేసింగ్ ఎప్ : ది కిడ్ హు క్లైంబ్డ్ ఎవరెస్ట్’ పుస్తకాన్ని ఆయన రాశారు.  ఆ తర్వాత ‘ ఫేసింగ్ ది ఫ్రోజెన్ ఓషన్’ పేరుతో రెండో పుస్తకం విడుదల చేశారు. ఆ తర్వాత టెలివిజన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2006 నుంచి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ ’ పేరుతో టీవీ సిరీస్ తీయడం మొదలెట్టారు.

మోడీనే ఎందుకు ఎంచుకున్నారు?

బేర్ గ్రిల్స్ తన షోకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారిని ఎంచుకుంటారు. 2015లో అమెరికా ప్రెసిడెంట్​గా ఉన్న బారక్ ఒబామాతో కలిసి  ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ’ షో చేశాడు. అలాస్కా అడవుల్లో ఈ షోను అప్పట్లో షూట్ చేశారు. ఈ ఏడాది షో కోసం ప్రధాని మోడీని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. మోడీ కేవలం ఇండియాకు పరిమితమైన నాయకుడు కాదు. గ్లోబల్ ఇమేజ్ ఉన్న లీడర్.పర్యావరణాన్ని ప్రేమించే దేశాధినేతగా కూడా అనేక దేశాల్లో ఆయన పాపులర్. అంతేకాదు మోడీ తన చుట్టూ ఒక గిరి గీసుకుని ఉండే నాయకుడు కాదు. ఏ ప్రాంతానికి వెళితే  అక్కడి ప్రజలతో కలిసిపోతారు. అక్కడి డ్రస్సులను వేసుకుంటారు. అక్కడి సంప్రదాయాలను ఫాలో అవుతారు. 2014 లో జపాన్ వెళ్లినప్పుడు డ్రమ్స్ వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఆఫ్రికా దేశాల టూర్​లోనూ డ్రమ్స్ వాయించి సందడి చేశారు. ‘ ప్రధాని అంటే ఇలాగే ఉండాలి ’ అని రూల్స్ పెట్టుకోకుండా సరదాగా అన్ని ప్రాంతాల ప్రజలతో కలిసిపోయే లీడర్​గా ప్రపంచదేశాల్లో ఆయన తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. అందుకే డిఫరెంట్​గా ఉండే మోడీని తన సాహస షోకి బేర్ గ్రిల్స్​ని సెలెక్ట్ చేసుకున్నారు.

ఓ సంభాషణ

నరేంద్ర మోడీ, బేర్ గ్రిల్స్ తో జీపులో ప్రయాణిస్తూ ఓ చోట ఆగారు.  అడవిలో అది డేంజర్ జోన్ గా ముద్రపడ్డ ప్రాంతం.

గ్రిల్స్: అడవిలో తిరగడానికి మీకు భయం వేయడం లేదా ?

మోడీ: లేదు. అడవిలో ఏ ప్రాంతాన్ని నేను డేంజర్ జోన్ గా ఫీలవ్వను. మనం ప్రకృతికి సహకరిస్తే  ప్రకృతి కూడా మనకు సాయం చేస్తుంది. నేచర్ తో డీల్ చేయడంలో ఉన్న  లాజిక్ ఇదే. అయినా నాకు భయం అనేదే లేదు.

అప్పటికి అడవిలో ఇద్దరూ చాలా సేపు నడిచారు. బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నారు. సెలయేరు కనిపించగానే  గ్రిల్స్ కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. కాసేపు రెస్ట్ తీసుకుందామని మోడీని అడిగాడు. మోడీ ఓకే అన్నారు. ఇద్దరూ కూర్చోగానే గ్రిల్స్ తన దగ్గర ఉన్న  ఫ్లాస్క్ నుంచి  గరంగరం చాయ్ మోడీకి  ఆఫర్ చేశాడు.

గ్రిల్స్: సార్….ఇండియా అనేక రంగాల్లో విజయాలు సాధించింది. ఇదెలా సాధ్యమైంది ?

మోడీ: భారతీయ మూలాల్లోనే  అభివృద్ధి కి సంబంధించిన అనేక అంశాలున్నాయి. ఉదాహరణకు  క్లీనీనెస్ గురించి ఇండియన్స్ కు బయటి వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు పర్సనల్ హైజీన్ కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. మహాత్మా గాంధీ ఈ విషయంలో చాలా కృషి చేశారు.

ఇతర ప్రముఖులెవరంటే…

మ్యాన్​ వర్సెస్​ వైల్డ్​లో సాధారణంగా సినీ ప్రముఖులు, అడ్వంచరిస్టులే కనిపిస్తారు. ఇంతకుముందు అమెరికన్​ యాక్టర్లు విల్​ ఫెరల్​, జేక్​ జిలెన్​హాల్​, మైఖేల్​ బి.జోర్డాన్​, సింగర్​ జాక్​ ఎఫ్రాన్​, హాలీవుడ్​ కమెడియన్​ బెన్​ స్టిలర్, నటీమణులు టైటానిక్​ హీరోయిన్​ కేట్​ విన్​స్లెట్​, నటి వనెసా హడ్జెన్స్, గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్​ విన్నర్​, ఫ్యాషన్​ డిజైనర్​ కేట్​ హడ్సన్​, మిఛెల్​ రోడ్రిగ్స్​ వంటివారు పాల్గొన్నారు.

వీళ్లు కాకుండా రాజకీయ ప్రముఖులు ఇద్దరే ఇద్దరు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అమెరికా ప్రెసిడెంట్​గా ఉన్న రోజుల్లో బరాక్​ ఒబామాకూడా ఒక ఎపిసోడ్​లో కనిపించారు. ఒబామా పదవీకాలం చివరలో రన్నింగ్​ వైల్డ్​ విత్​ బేర్​ గ్రిల్స్ పేరుతో తీసిన ఈ ఎపిసోడ్​లో అలాస్కాలో క్లైమేట్​ మార్పులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను బాగా చర్చించారు. మళ్లీ ఇన్నేళ్లకు ప్రధాని మోడీతో ప్రోగ్రాం ప్లాన్​ చేశారు. ఎవరితో ప్రోగ్రాం చేసినా తాను ఎంచుకున్న ఔట్​డోర్​లోనే తీయడం బేర్​ గ్రిల్స్​ ప్రత్యేకత. మోడీతో జిమ్​ కార్బెట్​ పార్కులో తిరిగితే, బరాక్​ ఒబామాతో అలాస్కా పర్వతాల్లో గడిపారు. అక్కడి వాగుల్లో దొరికిన చేపల్ని పట్టుకుని కాల్చుకు తిన్నారు ఇద్దరూ!

Latest Updates