కీలక శాఖలకు పెద్దాఫీసర్లు లేరు!

Full fledged officers who do not have for major branches
 • ప్రధాన శాఖలకు లేని పూర్తిస్థాయి అధికారులు
 • ఏళ్లుగా నాలుగైదు‘ఇన్‌‌చార్జి’ బాధ్యతలు చూస్తున్నఐఏఎస్‌‌లు
 • ఏ శాఖపైనా ఫోకస్‌‌  చేయలేని పరిస్థితి
 • కుప్పలుగా ఫైళ్లు, పెండింగ్‌‌ పనులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని కీలక శాఖలన్నీఇన్‌ చార్జీల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఏ ఆఫీస్‌‌లోనూ పెద్దాఫీసర్లు లేక పనులన్నీ పెండింగ్‌ లోనే ఉండిపోతున్నాయి. చాలా శాఖల్లో కమిషనర్ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండరు.. ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటే కమిషనర్ ఉండరు. ఒక్కో ఐఏఎస్‌‌కు నాలుగైదు శాఖల్ని అదనంగా కేటాయించారు.దీంతో ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది.

అన్ని పనులకూ వాళ్లే..

నిజానికి ఒక్కశాఖలోని పనులను చక్కబెట్టేందుకే ఐఏఎస్‌‌లు తీరిక లేకుండా పనిచేస్తుంటారు. జీవోలు తయారు చేయడం, పాలసీలను రూపొందించడం, ప్రభుత్వ పెద్దలకు అంతర్గత సలహాలివ్వడం, కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ వంటివన్నీ ఐఏఎస్‌‌ల బాధ్యతలే. కలెక్టర్లు , డైరెక్టర్లు , కమిషన-ర్లు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేకప్రధాన కార్యదర్శులంతా ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తుంటారు.ఆయా శాఖలకు కేటాయించి న నిధుల వ్యయాల-ను పరిశీలిస్తుంటారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేస్తారు. సూచనలు, సలహాలకు ప్రభుత్వం ఐఏఎ-స్‌‌లపైనే ఆధారపడుతుం ది. ఉన్న పోస్టులే భారంఅవుతుం టే మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగిస్తు-న్నారు. కొంతమందికి 3-4 పోస్టుల అదనపు బాధ్యతలున్నాయి. చాలా శాఖలకు పూర్తిస్థాయి ముఖ్య కార్యదర్శుల్లేరు. ఉన్న కార్యదర్శులకే మిగతాశాఖల అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కమిషనర్ల స్థాయిలోనూ అదనపు బాధ్యతలిచ్చారు.కొన్ని శాఖల ముఖ్య కార్యదర్శులే తమ శాఖల కమిషనర్‌‌ పోస్టుల్లో ఇన్‌ చార్జీలుగా కొనసాగుతున్నారు.

ఏదీ పర్యవేక్షణ

పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతోఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోం ది. దీంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఇక కీలక ఫైళ్లు, పనులు ఆగిపోతున్నాయి. ఇన్‌ చార్జీలు అదనపు బాధ్యతల్ని లైట్‌ తీసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఇవీ ‘ఇన్‌‌చార్జి’ బాధ్యతలు

 • సునీల్‌‌ శర్మ: రవాణా శాఖ ప్రిన్సి పల్‌‌ సెక్రటరీ. ఆర్టీఏ కమిషనర్‌‌, ఆర్టీసీ ఇన్‌ చార్జి ఎండీ శాఖలను అదనంగా చూస్తున్నారు.
 • సోమేశ్‌ కుమార్‌‌: కమర్షియల్‌‌ ట్యాక్స్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ. ఎక్సైజ్‌‌శాఖ ప్రిన్సి పల్‌‌ సెక్రటరీతోపాటు కమిషనర్‌‌. తాజాగా అదనపు ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ బాధ్యతలూ ఇచ్చారు.
 • అజయ్‌‌ మిశ్రా : ప్రభుత్వ స్పెషల్‌‌ చీఫ్‌ సెక్రటరీ. విద్యుత్‌‌, పర్యావరణ, ఎస్సీ అభివృద్ధి, సైన్స్‌‌ అండ్‌‌ టెక్నాలజీ శాఖలు అదనం.
 • బుర్ర వెం కటేశం : పర్యాటక, యూత్‌‌, స్పోర్ట్స్‌ , సాంస్కృతిక, బీసీ సంక్షేమ శాఖలు
 • రాజేశ్వర్‌‌ తివారీ : రెవెన్యూ, స్టాంప్స్‌‌, సీసీఎల్‌‌ఏ, రిజిస్ట్రేషన్లు, టీఎస్‌‌ రెరా చైర్మన్‌
 • ఎస్‌‌కే జోషి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు.
 • వికాస్‌‌ రాజ్‌ : పంచాయతీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ.
 • సందీప్‌ కుమార్‌‌ సుల్తా నియా : సీఎంఓ అదనపు కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ

Latest Updates