‘కోచ్​మిత్ర’ యాప్​కు ఫుల్​ రెస్పాన్స్

హైదరాబాద్‌, వెలుగు : రైళ్లలో సమస్యల పరిష్కారానికి ప్రవేశపెట్టిన ‘కోచ్​మిత్ర’ యాప్​కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. సౌత్​సెంట్రల్​రైల్వే (ఎస్సీఆర్) పరిధిలో 72 రైళ్లలో అందుబాటులో ఉండగా, విజయవంతంగా అమలవుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ యాప్​ను 10వేల మందికి పైగా డౌన్​లోడ్​ చేసుకున్నారని చెప్పారు. రైలు కోచ్​ల క్లీనింగ్, వాటర్, లైటింగ్‌, బెడ్స్, ఏసీలు తదితర సేవల్లో సమస్యలను తెలియజేసేందుకు ఈ యాప్​ను 2018లో తీసుకొచ్చారు. తొలుత ఆన్‌ బోర్డు హౌస్‌ కీపింగ్‌ సర్వీస్​(ఓబీహెచ్‌ఎస్‌) ఉన్న 800 రైళ్లలో ప్రవేశపెట్టగా… 2,167 రైళ్లకు విస్తరించారు. ఎస్సీఆర్​ పరిధిలో మరో రెండు రైళ్లలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నెలకు 470 మంది నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదుల్లో 90శాతం పరిష్కరించామని, 87శాతం కంప్లయింట్స్​ను 30 నిమిషాల లోపే సాల్వ్​చేశామని పేర్కొన్నారు. కేవలం 2శాతం ప్రయాణికులు మాత్రమే ఓబీహెచ్‌ఎస్‌ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.

Latest Updates