ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా : కేజ్రీవాల్ డిమాండ్

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన చేసిన ఒక ట్వీట్ లో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాపై బీజేపీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రధాని ఆ రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్  శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ కూడా రాష్ట్ర అవతరణ కోసం వేచి చూస్తోంది. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామంటూ గతంలో మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. దయచేసి మీ హామీని నెరవేర్చండి. 70ఏళ్లుగా పూర్తి స్థాయి హోదా లేకపోవడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ ట్వీట్ చేశారు.

Latest Updates