ట్రంప్‌ కారా.. మజాకానా..

ద బీస్ట్. డొనాల్డ్​ ట్రంప్ ప్రెసిడెన్షియల్ కార్. జనరల్ మోటార్స్​కు చెందిన ఫుల్లీ ఆర్మ్‌డ్ కాడిలాక్
మోడల్ ఇది. కాడిలాక్ వన్, ఫస్ట్​ కార్ అని కూడా పిలుస్తారు. దీని కోడ్ నేమ్ స్టేజ్ కోచ్. 20 ఏండ్లుగా యూఎస్ ప్రెసిడెంట్ కార్లను జనరల్ మోటార్స్​ తయారు చేస్తోంది. ఈ కారు ప్రెసిడెంట్ బ్లడ్‌ను క్యారీ చేస్తుంది. సొంతంగా ఆక్సిజన్‌ను సప్లై చేస్తుంది. ఎవరైనా ఆందోళనకారులు ఎదురుపడితే వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ కేనన్లు కూడా ఇందులో ఉంటాయి. 18 అడుగుల పొడవున్న ఈ కారు బరువు 8 టన్నులు. టాప్ స్పీడ్ గంటకు 96 కిలోమీటర్లు(60 మైల్స్​ పర్ అవర్). 15,000 పౌండ్ల ప్యూర్ మెటల్, రబ్బర్, హై గ్రేడ్ సిరామిక్‌తో దీని బాడీ తయారైంది. రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రనేడ్, ఐఈడీ బ్లాస్ట్​ కూడా దీనిని ఏమీ చేయలేవు. ఏడుగురు కంఫర్టబుల్‌గా కూర్చునే దీని ఖరీదు 15 మిలియన్ డాలర్లు. ఫ్యూయల్ ట్యాంక్ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. విండోస్‌ను పాలీకార్బోనేట్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. ఒక్కో డోర్ వెయిట్ దాదాపు బోయింగ్ 747 ఫ్లైట్ డోర్‌తో సమానం. లోపలి నుంచి డోర్ తెరవడం అసాధ్యం. 8 అంగుళాల మందంతో ఉంటే బుల్లెట్ ప్రూఫ్ ఇంటీరియర్ ఎలాంటి కెమికల్ లేదా బయోలాజికల్ అటాక్స్​ నైనా అడ్డుకోగలదు. యునైటెడ్ స్టేట్స్​ సీక్రెట్ సర్వీస్ ఈ కారు మెయింటెనెన్స్​ను చూస్తుంది. కాగా, ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే ట్రంప్ టూర్ కోసం వాడే వెహికిల్స్, ఇతర వస్తువులతో అమెరికా కార్గో ప్లేన్ ఒకటి ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది.

Latest Updates