నిధులివ్వడంలో 14వ ఆర్థిక సంఘం నిర్లక్ష్యం

హైదరాబాద్‌, వెలుగు: కేటాయింపులు చూస్తే వామ్మో.. అనిపిస్తుంది. చెల్లింపులు చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు నిధులివ్వడంపై 14వఆర్థిక సంఘం నాలుగేళ్లుగా చేస్తున్న కేటాయింపులతీరిది. ఐదేండ్ల కాలపరిమితిలో నాలుగేండ్లు పూర్తయినా 50 శాతం నిధులు కూడా ఇవ్వలేదు. వచ్చేఆర్థిక సంవత్సరం (2020- –21) నుంచి మొదలయ్యే 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ నందకిషోర్‌ సింగ్‌ ఇటీవల రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ పవర్ పాయింట్‌ ప్రజెంటే షన్‌ ద్వారా వాస్తవఅంశాలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లింది. మరోఏడాదే గడువున్నందున వీలైనంత త్వరగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేసింది.

రెండు రకాలుగా గ్రాంట్లు

2015-16లో మొదలైన 14వ ఆర్థిక సంఘం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) ముగిసేనాటికి పూర్తికానుం ది. 14వ ఆర్థిక సంఘం మున్సిపాలిటీలు, కార్పొ రేషన్లకు రెండు రకాలుగా నిధులు(గ్రాంట్లు ) మంజూరు చేసింది. వాటిల్లో బేసిక్‌ గ్రాంట్‌, పర్ఫామెన్స్‌ గ్రాంట్ లు ఉన్నాయి. ఆర్థిక సంఘం ఐదేండ్లకాలానికి ఏటా బేసిక్‌ గ్రాంట్‌  కేటాయిస్తుంది. దానిఆధారంగా పర్ఫామెన్స్‌ గ్రాంట్‌ ఇస్తుంది. గత నాలుగేండ్లలో బేసిక్‌ గ్రాంట్స్ కు పర్ఫామెన్స్‌ గ్రాంట్‌ మధ్యతీవ్ర అంతరం ఉండడంతో మున్సిపాలిటీల్లో చేపట్టేపలు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

దశలవారీగా అత్తెసరు నిధులు

ఏటా ఇవ్వాల్సిన బేసిక్‌ గ్రాంట్స్‌, పర్ఫామెన్స్‌ గ్రాం-ట్లకు దశలవారీగా కొద్దిమొత్తంలో విదిలిస్తున్నది.2016-–17 సంవత్సరం నాటికి 60 మున్సిపాలిటీలుపర్ఫామెన్స్‌ గ్రాంట్ కు అర్హత కలిగి ఉన్నాయి. ఆర్థికసంఘం నుం చి రూ.3,388.90 కోట్ల కేటాయిం పు-ల్లో ఇప్పటి వరకు ఇచ్చిం ది రూ.1,305.24 కోట్లే.ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.2,083.67 కోట్లుమున్సిపాలిటీలకు రావాల్సి ఉంది.

14వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, మంజూరు వివరాలు(రూ.కోట్లల్లో )

వివరాలు                       2015-16              2016-17            2017-18             2018-19            2019-20             మొత్తం

మొత్తంబేసిక్ గ్రాంట్‌          325.23                 450.33              520.32               601.92              813.32                2,711.12

పర్ఫామెన్స్‌ గ్రాంట్‌            0.0                       132.91             150.41               170.81              223.66               677.78

మొత్తం కేటాయింపులు      325.23                583.24             670.73                 772.73              1,036.98           3,388.90

నిధుల విడుదల               291.95                538.68              474.61               0.0                    0.0                    1,305.24

రావాల్సిన బ్యాలెన్స్‌         33.28                   44.56                 196.12              772.73               1,036.98            2,083.67

 

 

Latest Updates