మెగా,నవయుగాకు వేలకోట్లా..ఆర్టీసీకి ఇవ్వడానికి డబ్బులు లేవా : మాజీ ఎంపీ వివేక్

రామగుండం రీజియన్ జీడీకే 11 ఇంక్లైన్ గని పై బీఎంఎస్ ఆధ్వర్యం లో  బొగ్గు బాయికి  అలాయ్ బలాయ్…. హక్కుల కోసం లడాయి కార్యక్రమం లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రావాలని కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కు పొత్తు పెట్టించింది కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. కమీషన్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పైవేల కోట్ల రూపాయల ప్రాణహీత ప్రాజెక్ట్ , కాళేశ్వరం ప్రాజెక్టు ను లక్ష కోట్లు చేశారని మండిపడ్డారు. మెగా కంపెనీకి 25వేల కోట్లు, నవయుగ కు 8వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వం, ఆర్టీసీ కి ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు.  252 మంది రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద హోదాల్లో వుంచి ఇష్టం వచ్చినప్పుడు కేసిఆర్ పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు.  కేంద్రానికి కడుతున్న మైనింగ్ సెస్ నుంచి 230 కోట్లు తిరిగి కార్మికులకు వచ్చేలా బీజేపీ, బీఎంఎస్ కృషి చేస్తుందని వివేక్ వెంకటస్వామి చెప్పారు.

Latest Updates